ఇక్కడ ఏదో జరుగుతోంది?
మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరుగుతుందన్న అనుమానాలు సామాన్య ప్రజలకు కూడా వస్తున్నాయి. ఇందుకు కారణం రాజకీయ పార్టీలు వ్యవహార శైలే. సంకీర్ణ ప్రభుత్వం తనంతట తానే కూలిపోతుందని [more]
మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరుగుతుందన్న అనుమానాలు సామాన్య ప్రజలకు కూడా వస్తున్నాయి. ఇందుకు కారణం రాజకీయ పార్టీలు వ్యవహార శైలే. సంకీర్ణ ప్రభుత్వం తనంతట తానే కూలిపోతుందని [more]
మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరుగుతుందన్న అనుమానాలు సామాన్య ప్రజలకు కూడా వస్తున్నాయి. ఇందుకు కారణం రాజకీయ పార్టీలు వ్యవహార శైలే. సంకీర్ణ ప్రభుత్వం తనంతట తానే కూలిపోతుందని ఇటీవల మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలో కలహాలే ప్రభుత్వం కొంపముంచుతాయని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. తామేమీ జోక్యం చేసుకోమని, తాము ప్రభుత్వాన్ని పడదోయబోమని చెబుతున్నారు.
బీహార్ ఎన్నికల తర్వాత….
అయితే బీహార్ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయంటున్నారు. ఇప్పటికే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తాయి. లాక్ డౌన్ నిబంధనలు, బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై కొంత ఇబ్బందులు తలెత్తాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.
శివసేన, బీజేపీ…..
తాజాగా కూడా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో కలసి చర్చించారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ భేటీ కూడా మహారాష్ట్రలో చర్చనీయాంశమైంది. అయితే సామ్నా పత్రిక ఇంటర్వ్యూ కోసమే తాను ఫడ్నవిస్ ను కలిశానని, ఆయన మాకు శత్రువేమీ కాదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించండం విశేషం. తిరిగి శివసేన, బీజేపీల మైత్రికి బీజం పడిందన్న వ్యాఖ్యలు కూడా మహారాష్ట్రలో విన్పిస్తున్నాయి.
పవార్ తోనూ…..
దీంతో పాటు శరద్ పవార్ కు కూడా బీజేపీ గాలం వేస్తుందంటున్నారు. ఎన్డీఏ నుంచి వరసగా మిత్రపక్షాలు వెళుతుండటంతో బలమైన నేతలను ఎన్డీఏలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తుందంటున్నారు. మహారాష్ట్రలో బలంగా ఉన్న ఎన్సీపీని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. అందుకే కేంద్రమంత్రి అధవాలే ఎన్డీఏలోకి శరద్ పవార్ వస్తే పెద్దపదవి దక్కుతుందని పదే పదే చెబుతున్నారు. మొత్తం మీద మహారాష్ట్రలో ఏదో జరుగుతుందన్నది మాత్రం వాస్తవం. అయితే ఏది జరిగినా అది బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాతేనని అంటున్నారు.