సైడయి పోవడమే బెటరటగా?
పార్టీలు మారి వస్తే అంతే. కొన్నేళ్లుగా పార్టీలో ఉండేవారికే దిక్కులేకుండా పోయింది. అలాంటిది కీలక సమయంలో హ్యాండిచ్చిన వారిని జగన్ ఎలా ఆదరిస్తారు. ఇదే విషయం కర్నూలు [more]
పార్టీలు మారి వస్తే అంతే. కొన్నేళ్లుగా పార్టీలో ఉండేవారికే దిక్కులేకుండా పోయింది. అలాంటిది కీలక సమయంలో హ్యాండిచ్చిన వారిని జగన్ ఎలా ఆదరిస్తారు. ఇదే విషయం కర్నూలు [more]
పార్టీలు మారి వస్తే అంతే. కొన్నేళ్లుగా పార్టీలో ఉండేవారికే దిక్కులేకుండా పోయింది. అలాంటిది కీలక సమయంలో హ్యాండిచ్చిన వారిని జగన్ ఎలా ఆదరిస్తారు. ఇదే విషయం కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి విషయంలో స్పష్టమవుతుంది. ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ కోసం ఎంత చించుకున్నా ప్రయోజనం లేదనిపిస్తుంది. జగన్ పూర్తిగా తనను నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇస్తారని ఎస్వీ మోహన్ రెడ్డి విషయంలో తేలిపోయిందని అంటున్నారు.
పార్టీ నుంచి వెళ్లి….
2014 ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి తర్వాత తన బావ భూమా నాగిరెడ్డితో కలసి వైసీపీని వీడారు. టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఎస్వీ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అక్కడ అన్ని రకాలుగా బలమున్న టీజీ కుటుంబం ఉండటంతో ఎస్వీ మోహన్ రెడ్డిని చంద్రబాబు పక్కన పెట్టారు. దీంతో ఎన్నికలకు ముందు ఎస్వీ మోహన్ రెడ్డి తిరిగి వైసీపీలో చేరిపోయారు.
ఎమ్మెల్యే వర్సెస ఎస్వీ….
2019 ఎన్నికల్లో కర్నూలు వైసీపీ టిక్కెట్ ను హఫీజ్ ఖాన్ కు ఇచ్చారు. జిల్లా అంతటా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎస్వీ మోహన్ రెడ్డి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. అనేక కార్యక్రమాలను ఎమ్మెల్యేకు ధీటుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. అయితే అధిష్టానం మాత్రం హఫీజ్ ఖాన్ వైపే ఉందంటున్నారు.
ఎమ్మెల్యే వైపే హైకమాండ్….
ఒకసారి నమ్మించి మోసం చేసిన ఎస్వీ మోహన్ రెడ్డిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ అధినాయకత్వం అభిప్రాయంగా ఉంది. జగన్ కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఎస్వీ మోహన్ రెడ్డిని పట్టించుకోలేదు. వేదికపైకి కూడా రానివ్వలేదు. తాజాగా కర్నూలు సిటీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వైసీపీ అధినాయకత్వం గమనిస్తుంది. ఎస్వీ మోహన్ రెడ్డికి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. టీడీపీలో బలమైన ప్రత్యర్థి ఉన్నారు. దీంతో వైసీపీలోనే ఉండి తేల్చుకోవాలని ఎస్వీమోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం హఫీజ్ ఖాన్ వైపే ఉందంటున్నారు.