స్వామీజీకి మళ్లీ గిరాకీ పెరిగిందా… క్యూకడుతున్న నేతలు
ఆ స్వామికి మళ్లీ గిరాకీ పెరిగిందట. ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో తాజాగా వైరల్ అవుతున్న కామెంట్ ఇది. దీంతో ఎవరా స్వామి అంటూ.. నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ [more]
ఆ స్వామికి మళ్లీ గిరాకీ పెరిగిందట. ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో తాజాగా వైరల్ అవుతున్న కామెంట్ ఇది. దీంతో ఎవరా స్వామి అంటూ.. నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ [more]
ఆ స్వామికి మళ్లీ గిరాకీ పెరిగిందట. ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో తాజాగా వైరల్ అవుతున్న కామెంట్ ఇది. దీంతో ఎవరా స్వామి అంటూ.. నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. విశాఖ జిల్లాకు చెందిన స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.. ఇటు ఏపీలోను, అటు తెలంగాణలోనూ పొలిటికల్‌గా మంచి పాపులర్ అయ్యారు. దేవుడిని నమ్మని రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఈయనకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నారు. ఈ స్వామి దయవల్లే.. పాలిటికల్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను ప్రభంజనాలు చోటు చేసుకుంటున్నాయని అనే వారు కూడా ఉన్నారు.
స్వామి చెబితే….
వాస్తవానికి గతంలో రాజుల కాలంలో స్వాములకు, ఆస్థాన జ్యోతిష్కులకు మంచి గిరాకీ ఉండేదని విన్నాం. రాజులు ఏం చేయాలన్నా కూడా స్వాములను, కుల గురువులను సంప్రదించి చేసేవారట. కానీ, ఇప్పుడు ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలే కీ పాయింట్ కాబట్టి ప్రజలకు చెప్పి, ప్రజల మాట విని చేయాలనేది ప్రజాస్వామ్యం యొక్క కీలక అంశం. అయితే, నాయకులు ప్రజలకు చెప్పినా చెప్పకున్నా.. స్వాములకు చెప్పి.. పనులు ప్రారంభిస్తున్నారు. స్వాములు ఆశీస్సుల మేరకు వారు ముందుకుసాగుతున్నారు.
క్యూ కడుతున్నారే….
ఏపీలోను, తెలంగాణలోనూ ప్రభుత్వాలు ఈ వైఖరి విషయంలో ఎలాంటి భిన్న దృక్ఫథం లేకుండా ముందుకు సాగుతుండడం గమనార్హం. ఏపీలో అయితే, ఒకే ఒక్కస్వామి సలహాను సీఎం జగన్ తీసుకుంటున్నారు. అదే తెలంగాణలో అయితే మాత్రం.. అక్కడి సీఎం కేసీఆర్ ఒకపక్క విశాఖ స్వామిని, మరోపక్క చినజీయర్‌ను కూడా సంప్రదించనిదే.. నిర్ణయాలు తీసుకోవడం లేదట. సరే ఈ విషయం పక్కన పెడితే.. మరోసారి విశాఖ స్వామికి నేతల తాకిడి పెరిగింది.నిత్యం ఉదయాన్నే నాయకుల కార్లు.. ఆ ఆశ్రమం ముందు క్యూకడుతున్నాయట.
సిఫార్సు కోసమే…
వీరంతా వైసీపీ నేతలనేని ఆశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆశ్రమం విషయంలో వార్తల్లో హాట్ హాట్‌గా మారిపోయింది. రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో బెర్తులు ఆశిస్తున్న నాయకులు స్వామి సిఫారసు కోసం వచ్చినట్టు తెలిసింది. మరి స్వామి వారు ఎవరికి సిఫారసు చేస్తారో… చూడాలి. ఉన్నది నాలుగు సీట్లు.. ఏం జరుగుతుందో చూడాలి.