జగన్ అంచనా తప్పుకాలేదు.. వారివల్లనే గెలుపట
వాలంటీర్ల వ్యవస్థ వైసీపీకి బాగా కలసి వచ్చిందా? వారి వల్లనే పంచాయతీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో మద్దతుదారులు గెలుపొందారా? అంటే అవుననే అంటున్నాయి విపక్షాలు. వాలంటీర్ల వ్యవస్థను [more]
వాలంటీర్ల వ్యవస్థ వైసీపీకి బాగా కలసి వచ్చిందా? వారి వల్లనే పంచాయతీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో మద్దతుదారులు గెలుపొందారా? అంటే అవుననే అంటున్నాయి విపక్షాలు. వాలంటీర్ల వ్యవస్థను [more]
వాలంటీర్ల వ్యవస్థ వైసీపీకి బాగా కలసి వచ్చిందా? వారి వల్లనే పంచాయతీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో మద్దతుదారులు గెలుపొందారా? అంటే అవుననే అంటున్నాయి విపక్షాలు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకు వచ్చారు. ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించారు. వీరే ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు ఇళ్ల వద్దకు చేరుస్తారు. రేషన్ కార్డు నుంచి అనేక సమస్యలను వీరే దగ్గరుండి పరిష్కరిస్తారు.
విపక్షాలు విమర్శిస్తున్నా…..
వాలంటీర్ల వ్యవస్థను దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ప్రశంసించాయి. కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో వాలంటర్లీ వ్యవస్థపై ఆరోపణలు వచ్చాయి. తమకు కేటాయించిన యాభై కుటుంబాలను వీరు అధికార పార్టీకి ఓటు వేయాల్సిందిగా వత్తిడి తెచ్చారని, లేకుంటే ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని హెచ్చరించారన్న విమర్శలు వచ్చాయి.
కుటుంబాలపై ప్రభావం…
నిజమే.. వాలంటీర్లు యాభై కుటుంబాలతో నెలలో కనీసం రెండు, మూడు సార్లు భేటీ అవుతారు. పథకాలను అందచేస్తారు. వారి మధ్య సత్సంబంధాలుంటాయి. ఈ సత్సంబంధాలనే అధికార వైసీపీ పార్టీ వినియోగించుకుంటుందని చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఎంత బలమైనదో పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గుర్తించింది. అందుకే చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతల వరకూ వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
వారు మద్దతివ్వని చోట…..
వాలంటీర్లు మద్దతివ్వని చోట వైసీపీ ఓటమి పాలయిందంటున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ, మోదేపల్లిలో వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని వెంటనే పదిమందిని తొలగించిన విషయాన్ని కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదే వాలంటీర్ల వ్యవస్థ కొనాసాగితే వచ్చే ఏ ఎన్నికల్లోనైనా వీరి నుంచి విపక్షాలకు ఇబ్బందులు తప్పవు. అందుకే విపక్షాలన్నీ ఇప్పుడు వైసీపీ కంటే వాలంటీర్ల వ్యవస్థను చూసి కంగారు పడుతున్నాయి.