తంబిలు మాట వినడం లేదట…అందుకే?
కరోనా వైరస్ తో తమిళనాడు అతలాకుతలం అవుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత స్థానంలో తమిళనాడు ఉంది. ఇందుకు మర్కజ్ మసీదు [more]
కరోనా వైరస్ తో తమిళనాడు అతలాకుతలం అవుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత స్థానంలో తమిళనాడు ఉంది. ఇందుకు మర్కజ్ మసీదు [more]
కరోనా వైరస్ తో తమిళనాడు అతలాకుతలం అవుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత స్థానంలో తమిళనాడు ఉంది. ఇందుకు మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారే కారణమని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలను కూడా తమిళనాడులో సక్రమంగా పాటించడం లేదన్నది వాస్తవం. తమిళనాడులో కరోనాను ప్రజలు లైట్ గా తీసుకుంటున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి.
లాక్ డౌన్ ఉన్నా యధేచ్ఛగా….
లాక్ డౌన్ కొనసాగుతున్నా తమిళనాడులో జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దు చనిపోతే దాని అంత్యక్రియలకు జనం భారీగా హాజరయ్యారు. భౌతిక దూరం పాటించలేదు. దీంతో దాదాపు 300 మంది పైన కేసులు నమోదు చేసింది. అలాగే మరోచోట సామూహిక భోజనాలు చేయడం కూడా వివాదాస్పద మయింది. ఇక తమిళనాడులో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా వైరస్ అంటుకుంది.
ఐదు నగరాల్లోనే…..
తమిళనాడులో ప్రధానంగా ఐదు నగరాల్లోనే ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. లాక్ డౌన్ నిబంధనలను కూడా యధేచ్ఛగా ఈ నగరాల్లో ఉల్లంఘిస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడయింది. దీంతో గత ఆదివారం నుంచి ఐదు నగరాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ ఈ ఐదు నగరాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు పళనిస్వామి ప్రకటించారు.
మరిన్ని రోజులు పొడిగించే…..
చెన్నై, మధురై, సేలం, తిరుప్పూర్, కోయంబత్తూర్ నగరాల్లో నాలుగు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రభుత్వ అమలు చేయనుంది. వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా ప్రజల నుంచి సహకారం అందుతుందా? లేదా? అన్నది ప్రశ్నగానే మారింది. వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో మే 3వ తేదీ తర్వాత కూడా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశముందంటున్నారు.