తండ్రీ కొడుకుల రాజకీయంతో అధికారులు విలవిల
ఆ నియోజకవర్గ రాజకీయాల్లో పెత్తనం చేస్తున్న తండ్రీ కుమారుల ధాటికి అధికారులు నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు కావడం.. భవిష్యత్తులో యువ నాయకుడు [more]
ఆ నియోజకవర్గ రాజకీయాల్లో పెత్తనం చేస్తున్న తండ్రీ కుమారుల ధాటికి అధికారులు నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు కావడం.. భవిష్యత్తులో యువ నాయకుడు [more]
ఆ నియోజకవర్గ రాజకీయాల్లో పెత్తనం చేస్తున్న తండ్రీ కుమారుల ధాటికి అధికారులు నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు కావడం.. భవిష్యత్తులో యువ నాయకుడు పగ్గాలు చేపట్టే అవకాశం ఉండడం, పైగా తండ్రి కీలకమైన పదవిలో ఉండడం వంటి రీజన్లతో అధికారులు ఇటు తండ్రికి అటు కుమారుడికి మధ్య నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేని సీతారాం హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని ఇక్కడ నుంచి బరిలో నిలపాలని తమ్మినేని సీతారాం భావిస్తున్నారు.
అనధికార సమీక్షలు…?
దీంతో కొన్నాళ్లుగా కుమారుడికి పగ్గాలు ఇచ్చేశారు. ఇది అనధికారికమే అయినప్పటికీ.. అధికారులను సైతం తమ్మినేని సీతారాం కుమారుడు.. నాగ్.. అనధికారికంగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే.. టీడీపీ అనుకూల నియోజకవర్గాల్లో పార్టీని డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చాపురం నియోజకవర్గంలో నేరుగా.. ఇక్కడ పేదలకు ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహిస్తే.. దానికి ఈయన హాజరయ్యారు. వాస్తవానికి ఇటు అధికారంలో కానీ, అటు అనధికారికంగా కానీ.. నాగ్‌కు ఇలాంటి సమీక్షల్లో పాల్గొనే అవకాశం లేదు.
పెద్దాయనకు కోపం వస్తుందని….
కానీ, అలాగని ఎవరూ అడ్డు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. కాదంటే..తమ్మినేని సీతారాం కు కోపం వస్తుంది.. అలాగని ఆయన్ను ఈ కార్యక్రమాలకు అలౌ చేస్తే.. ప్రతి పక్షాల నుంచి విమర్శలు తప్పవు. దీంతో ఏకంగా కలెక్టర్ సదరు సమీక్ను వేరే కారణం చెప్పి తప్పించుకున్నారు. ఇక, దీనిపై స్థానిక ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు అశోక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏం అర్హత ఉందని.. సమీక్షల్లో పాల్గొంటారంటూ..నిలదీశారు. దీనికి నాగ్ నుంచి కూడా మంచి కౌంటర్లే పడ్డాయి.మా నాన్న స్పీకర్.. ఒక నియోజకవర్గానికి పరిమితం కారు. ఆయన ప్రస్తుతం కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో నేను వచ్చాను తప్పేంటి. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ భార్యలు రాలేదా ? అని ఎదురు ప్రశ్నించారు.
ఎంపీగా దించాలని…..
ఇక ఈ విషయం ఇక్కడితో ఆగిపోయినా.. అధికారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. సమీక్షలు చేయాలంటే.. గుట్టుగా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఇక్కడే మరో ప్రచారం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం కుమారుడు నాగ్‌ను శ్రీకాకుళం ఎంపీగా బరిలోకి దించాలని… ఇందుకు సిద్ధంగా ఉండమని జగన్ సూచించారట. దీంతో నాగ్ ఇదే అదనుగా జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తూ వేళ్లు పెడుతుండడంతో పార్టీ నేతల్లో చాల మందికి నచ్చడం లేదు. ఈ తండ్రి కొడుకుల తీరుతో అటు అధికారులతో పాటు ఇటు సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారన్నదే లోకల్ టాక్ ?