తమ్మినేని వ్యూహానికి అడ్డు పడుతోందెవరు..?
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. రాజకీయ భవిష్యత్తులో కీలకమైన మంత్రి పదవి ఆయనకు దక్కుతుందా ? అవకాశాలపై ఎవరైనా నీళ్లు జల్లుతున్నారా ? శ్రీకాకుళం రాజకీయాల్లో [more]
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. రాజకీయ భవిష్యత్తులో కీలకమైన మంత్రి పదవి ఆయనకు దక్కుతుందా ? అవకాశాలపై ఎవరైనా నీళ్లు జల్లుతున్నారా ? శ్రీకాకుళం రాజకీయాల్లో [more]
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. రాజకీయ భవిష్యత్తులో కీలకమైన మంత్రి పదవి ఆయనకు దక్కుతుందా ? అవకాశాలపై ఎవరైనా నీళ్లు జల్లుతున్నారా ? శ్రీకాకుళం రాజకీయాల్లో ఏం జరుగుతోంది ? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. గత ఏడాది జగన్ సర్కారు కొలువుదీరడంతోనే స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎంపిక చేశారు. టీడీపీ నుంచి రాజకీయాలు చేసిన సీతారాం.. తర్వాత చంద్రబాబుతో విభేదించారు. ఇక, వైసీపీలో ఆయన గత ఏడాది నెగ్గిన తర్వాత.. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో 1999లో చివరిగా గెలిచిన ఆయన తర్వాత 20 ఏళ్లకు మళ్లీ అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంత సీనియర్ అయినా జగన్ మాత్రం అనూహ్యంగా ఆయనకు స్పీకర్ పోస్టును ఇచ్చారు. రాజకీయంగా సీనియర్ కావడం, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం ఉండడంతో తనకు ఇచ్చిన పోస్టులో ఇమడలేక పోతున్నారు తమ్మినేని సీతారాం.
చూసి వెళ్లండని చెప్పినా…..
అవకాశం వచ్చిన ప్రతిసారీ.. తాను రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నాను.. రాజకీయాల గురించి ఎందుకు ? అనే స్పృహ కూడా లేకుండా వహరిస్తున్నారు. అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. పైకి ఇవి వివాదంగా అనిపించినా.. తమ్మినేని సీతారాం దృష్టిలో మాత్రం.. వ్యూహాత్మకం. అదేవిధంగా వైసీపీ నేతల ఆలోచనలో.. అరె.. ఈయనకు మంత్రి పదవి ఇవ్వ కుండా తప్పు చేశామే అన్న చర్చలే ఎక్కువ వినిపిస్తున్నాయి. జగన్ ఒకటి రెండుసార్లు కాస్త చూసి వెళ్లండన్న అని చెప్పినా తమ్మినేని సీతారాం తీరు మాత్రం మారడం లేదు.
మంత్రి పదవి దక్కితే…..
వచ్చే ఏడాది ఎలాగూ.. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉంది. సో.. శ్రీకాకుళం నుంచి ఛాన్స్ లభించే అవకాశం కూడా ఆయనకు ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ.. ఇప్పటికైతే.. క్లారిటీ లేదు. అయితే, దీని వెనుక జిల్లాకు చెందిన కీలక నాయకుడు అడ్డు పడుతున్నారని అంటున్నారు. ఇటీవల ప్రమోషన్ పొందిన ఓ మంత్రి హస్తం ఉందనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. జిల్లాలో స్పీకర్‌గా ఉంటూనే పెత్తనం ఎక్కువగా చేస్తున్నారని. రేపు మంత్రి అయితే.. తమ్మినేని సీతారాం దూకుడుకు అడ్డుకట్ట వేసే అవకాశం కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది.
అసంతృప్తి పెరుగుతుందా?
ఇతర నేతల్లోనూ తమ్మినేని సీతారాంపై దాదాపు ఇదే అభిప్రాయం ఉండడంతో.. విషయం విజయసాయిరెడ్డి వరకు చేరింది. అయితే… ఇప్పటి వరకు ఈ విషయంలో నేతలు ఎవరూ బహిరంగ ప్రకటనలు.. అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. కానీ, మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ నాటికి ఈ అసంతృప్తి పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే సమయంలో జిల్లాకే చెందిన మంత్రి, డిప్యూటీ సీఎంగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌ను మార్చే అవకాశాలు కూడా లేవంటున్నారు. ఈ క్రమంలోనే తమ్మినేని సీతారాం ఆశలు నెరవేరేనా? అనే చర్చ సాగుతోంది.