ఈ ఇద్దరు ఎంపీలదీ చెరో దారి.. బాబుకు తలనొప్పి తప్పడం లేదా ?
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి ఇద్దరు ఎంపీలు సహకరించడం లేదా ? ఎవరి దారిలో వారు ఉన్నారా ? ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలకు [more]
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి ఇద్దరు ఎంపీలు సహకరించడం లేదా ? ఎవరి దారిలో వారు ఉన్నారా ? ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలకు [more]
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి ఇద్దరు ఎంపీలు సహకరించడం లేదా ? ఎవరి దారిలో వారు ఉన్నారా ? ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వారు పట్టించుకోలేదా ? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ సీనియర్లు. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కీలకమైన రెండు జిల్లాల్లో ఉన్నారు. విజయవాడ ఎంపీ.. కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌లు ఇప్పుడు సెంటర్ ఆప్ న్యూస్‌గా మారారు. వీరిద్దరికీ కూడా పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి లేదనే సంకేతాలు వస్తున్నాయి. నిజానికి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో కొంచెం కష్టపడితే పార్టీ మెజారిటీ గ్రామాల్లో ఏకగీవ్రాలు సాధించే అవకాశం ఉంది.
బాబు ప్రతిష్టాత్మకంగా….
రాజధాని మార్పు ప్రభావంతో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో సాధారణ ప్రజల్లోనూ అధికార పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. చివరకు వైసీపీ కార్యకర్తల్లోనూ ఈ ఆవేదన ఉంది. స్థానిక ఎన్నికల్లో అసలు టీడీపీ సత్తా చాటేది ఈ రెండు జిల్లాల్లోనే అన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. అలాంటి టైంలో ఈ రెండు జిల్లాల్లో ఉన్న ఈ ఎంపీలు ఇద్దరూ కూడా ఎవరికి వారుగా ఉండడం, ఎవరి వ్యూహాలు వారికి ఉండడంతో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతోపాటు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచుగా పార్టీ సమావేశాలు పెడుతున్నారు.
ఈ ఇద్దరు ఎంపీల్లో….
అయితే ఈ ఇద్దరు ఎంపీల్లో మాత్రం నిర్లిప్తత కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ నాని.. నాకెందుకు వచ్చింది! అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అసలు పార్టీ అధినేతకు కూడా ఆయన అందడం లేదు. దీంతో పరిస్థితి దారుణంగా ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తన పార్లమెంటు పరిధిలో కాస్త కష్టపడడంతో పాటు అక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌లతో సమన్వయం చేసుకుంటే మంచి ఫలితాలే వస్తాయి. అయినా నాని పట్టించుకోని పరిస్థితి. ఇక, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. తను చెప్పింది అందరూ వినాలనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు చంద్రబాబు మిగిలిన వారికంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండడంతో .. మిగిలిన నేతలను మాజీ మంత్రులను కూడా జయదేవ్ .. పట్టించుకోవడం లేదు.
లైట్ గా తీసుకుంటూ….
పోనీ.. పంచాయతీ ఎన్నికల్లో అన్నీ తనే అయి వ్యవహరిస్తున్నారా ? అంటే.. అది కూడా లేదు. వీటిని లైట్‌గా తీసుకుంటున్నారు. ఇక పొలిట్‌బ్యూరోలో ఆయనకు ప్రయార్టీ పెరగడంతో పొన్నూరు, తెనాలి మాజీ ఎమ్మెల్యేలను కూడా ఆయన పట్టించుకోవడం లేదట. నిజానికి రాజధాని ఇష్యూతో ముందుకు సాగి.. పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.కానీ, గల్లా మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పార్లమెంటు ప్రారంభంతో ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడే ఉండిపోయారు. దీంతో ఈ కీలక సమయంలో పార్టీ కంచుకోటల్లో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు పార్టీ నేతలు.