Tdp : వెంపర్లాడితే ఫ్యూచర్ లో ఇబ్బంది పడతామా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే అన్ని పార్టీలూ లెక్కలు వేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకూ ముఖ్యం. అందుకోసమే గత ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే అన్ని పార్టీలూ లెక్కలు వేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకూ ముఖ్యం. అందుకోసమే గత ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే అన్ని పార్టీలూ లెక్కలు వేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకూ ముఖ్యం. అందుకోసమే గత ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ ఈసారి అలాంటి తప్పులు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రధాన విపక్షమైన తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఒంటరిగా పోటీ చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అందరికీ తెలిసిందే. అందుకే వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్లాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన.
కేవలం 30 స్థానాల్లోనే….
గత ఎన్నికల్లో జనసేన కారణంగా ముప్ఫయి అసెంబ్లీ స్థానాలను కోల్పోయినట్లు టీడీపీ లెక్కలు వేసింది. ఇవి కూడా ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి, కోస్తాంధ్ర జిల్లాల్లోనే. ఈ ముప్ఫయి స్థానాల్లో వచ్చిన ఓట్లను చూసుకుంటే ఇక్కడ కలసి పోటీ చేసి ఉంటే టీడీపీ విజయం సాధించేది. అయితే మిగిలిన చోట్ల జనసేన అనుకున్నరీతిలో ప్రభావం చూపలేకపోయింది. చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.
ఎక్కువ స్థానాలను…
దీంతో తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం మొదలయింది. తాము పొత్తుకోసం జనసేనతో వెంపర్లాడితే వారు యాభైకి సీట్లను అడిగే అవకాశముంది. దీంతో యాభై స్థానాల్లో పార్టీ భవిష్యత్ లో బలహీన పడే అవకాశముంది. జనసేన బలంగా ఉన్న ముప్ఫయి స్థానాల వల్ల అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అలాగని ఇరవై స్థానాలను పొత్తులో భాగంగా ఇస్తామన్నా జనసేన ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. అందుకే జనసేన బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తుంది.
అక్కడే బలోపేతం అయితే?
ఇటీవల జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు సయితం చంద్రబాబుకు ఇదే సలహా ఇచ్చారంటున్నారు. జనసేన మద్దతుతో కొంత ఓటింగ్ శాతం పెరగవచ్చేమో కాని భవిష్యత్ లో అన్నీ ఇబ్బందులు, చికాకులు తప్పవని హెచ్చరించారంటున్నారు. అందుకే జనసేన బలంగా ఉన్న ప్రాంతాలపై అవసరమైతే నాయకత్వ మార్పిడి చేయడం, జనసేన నుంచి వీలయితే పార్టీలోకి తీసుకురావడం వంటి చర్యల ద్వారా బలోపేతం కావాలని భావిస్తున్నారు. అంతే తప్ప పొత్తు కోసం వెంపర్లాడకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది.