గ్రౌండ్ లెవెల్లో అసలు సీన్ ఇదేనా?
తెలంగాణా రాజకీయం విషయంలో కొంత స్పష్టత ఉంది. టీఆర్ఎస్ ఈ రోజుకీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీపరంగా పటిష్టంగా ఉన్నా కూడా శతృవులు ఆ పార్టీలోనే ఎక్కువగా [more]
తెలంగాణా రాజకీయం విషయంలో కొంత స్పష్టత ఉంది. టీఆర్ఎస్ ఈ రోజుకీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీపరంగా పటిష్టంగా ఉన్నా కూడా శతృవులు ఆ పార్టీలోనే ఎక్కువగా [more]

తెలంగాణా రాజకీయం విషయంలో కొంత స్పష్టత ఉంది. టీఆర్ఎస్ ఈ రోజుకీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీపరంగా పటిష్టంగా ఉన్నా కూడా శతృవులు ఆ పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆయాసం, అత్యాశ బాగా ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పవర్ లోకి వస్తుందని ఇప్పటికైతే అంచనాలు లేవు. ఇక కాంగ్రెస్ విజయావకాశాలను బీజేపీ దెబ్బకొడుతుంది మళ్ళీ సేఫ్ జోన్ లోకి టీఆర్ఎస్ వస్తుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో ఉండే బాగుంటుంది అన్నదాని మీద అక్కడ రాజకీయ నాయకులకు ఒక రకమైన అవగాహన అయితే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పూర్తిగా దానికి భిన్నం. ఇక్కడ అంతా గందరగోళం తప్ప మరేమీ లేదు.
ఇది నిజమా…?
జగన్ బంపర్ మెజారిటీతో నెగ్గారు. ఆయన 151 సీట్లు, 50 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. కనీసం రెండు ఎన్నికల వరకైనా జగన్ ని ఎవరూ టచ్ చేయలేరు అని అంతా అనుకున్నారు. టీడీపీ పని అయిపోయింది అని తొలి నాళ్లలో వినిపించింది. కానీ సగం పాలన పూర్తి కాగానే వైసీపీ మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపిస్తోంది. అయితే అదంతా మీడియాలోనే ఎక్కువగా చోటు చేసుకోవడం విశేషం. మరి గ్రౌండ్ లెవెల్ లో అలా ఉందా? నిజంగా వైసీపీకి జనాలు చుక్కలు చూపిస్తారా అన్నది మాత్రం ఎంత తలపండిన నాయకులకు కూడా అర్ధం కాకుండా ఉందిట.
ఆ పార్టీ లేచినట్లేనా..?
ఇక ఏపీలో వైసీపీ పని సరి అనుకుంటే వెంటనే పైకి లేవాల్సిన పార్టీ టీడీపీ. ఎందుకంటే మొత్తం 175 నియోజకవర్గాలలో పట్టున్న పార్టీ అది, రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే. పైగా అపర చాణక్యుడు చంద్రబాబు సారధ్యం వహిస్తున్న పార్టీ. మరి ఇన్ని కళలు ఉన్న టీడీపీ పున్నమి చంద్రుడి మాదిరిగా వెలిగిపోవాలి కదా. కానీ టీడీపీ ఎక్కడా లేచినట్లు కానీ, జోరు చేస్తున్నట్లు కానీ సంకేతాలు అయితే ఇప్పటిదాకా అసలు లేవు. దాంతో ఏపీలో మరీ ఇంత అయోమయమేంటి బాబోయ్ అనుకుంటున్నారు రాజకీయ నేతలు.
డిఫెన్స్ లో ఎందుకు…?
ఒక వైపు బలమైన మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ జగన్ సర్కార్ ని, దాని ఇమేజ్ ని పలుచన చేయాలని చూస్తోంది. పత్రికలు చదివేవారికి, రాజకీయాలు చర్చించేవారికి ఈ రోజున ఎన్నికలు పెడితే వైసీపీ కచ్చితంగా ఓడుతుంది అన్న అంచనాకు వచ్చేలా ఈ రాతలు ఉన్నాయి. కానీ ఎన్నిక ఏది పెట్టినా కూడా ఏకపక్షంగా వైసీపీ గెలుస్తోంది. మరి వైసీపీ మీద ఇన్ని రకాలుగా విమర్శలు చేస్తూ నిందలు వేస్తూంటే ఎందుకు వైసీపీ అడ్డుకోలేకపోతోంది అన్న చర్చ కూడా ఉంది. డిఫెన్స్ లో వైసీపీ ఉండిపోవడం వల్ల జనాలకు కూడా జగన్ సర్కార్ పని సరా అన్న అనుమానాలు వస్తున్నాయిట. అంతే కాదు జగన్ వన్ టైమ్ సీఎం గానే మిగిలిపోతారా అన్న డౌట్లూ కలుగుతున్నాయట. అయితే ఇందతా టీడీపీ చంద్రజాలం, మీడియా ఇంద్రజాలమని రాజకీయ జీవులు పసిగడుతున్నారు. అందుకే టీడీపీలో చేరికలు లేవు అని అంటున్నారు. నిజానికి సగం పాలన పూర్తి అయితే జనల నాడి తెలిసిపోవాలి. కానీ ఏపీలో భిన్నంగా సీన్ ఉంటే మీడియా మాత్రం రాంగ్ రూట్లో వెళ్తోంది. దీంతో ఆశా జీవులు, రేపటి రాజకీయం కోసం ఎదురు చూసేవారు మాత్రం ఏపీ పాలిటిక్స్ ఎప్పటికీ అర్ధం కాదురా దేవుడా అనుకుంటున్నారుట.