టీడీపీ రెడ్డి గారు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా..?
విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్ర స్థానంలో ఉన్న రెడ్డి గారు ఒకరు బీజేపీ మీద ముచ్చట పడుతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయన టీడీపీలో [more]
విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్ర స్థానంలో ఉన్న రెడ్డి గారు ఒకరు బీజేపీ మీద ముచ్చట పడుతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయన టీడీపీలో [more]
విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్ర స్థానంలో ఉన్న రెడ్డి గారు ఒకరు బీజేపీ మీద ముచ్చట పడుతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయన టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీ పరంగానే కాకుండా సొంతంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి నగరవాసుల మనసుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. విశాఖ సిటీ రాజకీయాల్లో అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పించిన టీడీపీ రెడ్లను మాత్రం పక్కన పెట్టింది. దాంతో ఆయన చాలాకాలంగా మధన పడుతున్నారు.
హామీలే మిగిలాయి….
ఇక మూడేళ్ల క్రితం టీడీపీ హయాంలో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం గట్టిగా సాగింది. దాంతో మేయర్ అభ్యర్ధిగా రేసులోకి వచ్చారు స్వాతి రియల్ ఎస్టేట్ యజమాని కృష్ణారెడ్డి. ఆయన ఆర్ధికంగా సమర్ధుడు. గోదావరి జిల్లాలకు చెందిన ఈ రెడ్డి గారికి రాజకీయ బంధాలు చాలానే ఉన్నాయి. దాంతో ఆయన తన పేరుని పరిశీలించమని చంద్రబాబుకు విన్నపం చేసుకున్నారు. అయితే జీవీఎంసీ ఎన్నికలే మొత్తానికి వాయిదా పడ్డాయి. ఇక 2019 నాటి ఎన్నికలలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరినా టీడీపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. దాంతో ఆయన నిరాశగానే పార్టీలో కొనసాగుతున్నారు.
బీజేపీ దువ్వుతోందిగా…?
విశాఖ సహా ఉత్తరాంధ్రాలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ స్వాతి కృష్ణా రెడ్డిని దువ్వుతోంది అంటున్నారు. నగర రాజకీయాల్లో కీలకమైన నేత కావడం, అంగ, అర్ధ బలాలు దండీగా ఉండడంతో ఆయన వస్తే సిటీలో పార్టీకి మంచి బలం చేకూరుతుందని కాషాయదళం అంచనాలు వేస్తోంది. అయితే కృష్ణారెడ్డి తాను తెరచాటున ఉండి కుమారుడు రమేష్ రెడ్డిని బీజేపీలోకి పంపుతున్నారని టాక్. సరైన సమయం చూసుకుని తాను కూడా కమల తీర్ధం పుచ్చుకుంటారని కూడా చెబుతున్నారు.
అతి పెద్ద దెబ్బ…..
తెలుగుదేశం పార్టీకి ఇపుడు నగర రాజకీయాలో ఆర్ధికంగా వెన్నూ దన్నూ ఉన్న నాయకులు తగ్గిపోతున్నారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మరణించాక ఆర్ధికంగా పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక స్వాతీ కృష్ణా రెడ్డి లాంటి వారి అండదండలు విపక్షంలో ఉన్న వేళ టీడీపీకి చాలా అవసరం. అయితే అధికారంలో ఉన్నపుడు కనీసం పట్టించుకోకపోవడమే కాకుండా నామినేటెడ్ పదవిని సైతం ఇవ్వలేని పార్టీ పెద్దలు ఇపుడు ఉచితంగా సేవలు అందించమని కోరితే రెడ్డి గారు ఊరుకుంటారా. సర్దుకుపోతారా అన్నదే ప్రశ్న. ఆయనలాగానే చాలా మంది నేతలు టీడీపీ ని వీడిపోయేందుకు రెడీగా ఉన్నారట. సమయం సందర్భం చూసి వీరిని బీజేపీలోకి లాగేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పెట్టారని టాక్. మొత్తానికి రెడ్డి గారు టీడీపీని వీడితే సైకిల్ కి రెడ్ సిగ్నల్ పడడం ఖాయమని అంటున్నారు.