టీడీపీలో మరో కలకలం.. ఆయన సైకిల్ దిగుతున్నారా?
టీడీపీలో మరో కలకలం. ఇప్పటికే తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ కోలుకోలేని విధంగా ఉన్న విషయం తెలిసిందే. కీలక నాయకులు ఎవరూ కూడా ప్రజలలోకి [more]
టీడీపీలో మరో కలకలం. ఇప్పటికే తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ కోలుకోలేని విధంగా ఉన్న విషయం తెలిసిందే. కీలక నాయకులు ఎవరూ కూడా ప్రజలలోకి [more]
టీడీపీలో మరో కలకలం. ఇప్పటికే తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ కోలుకోలేని విధంగా ఉన్న విషయం తెలిసిందే. కీలక నాయకులు ఎవరూ కూడా ప్రజలలోకి రాలేక పోతున్నారు. ఇప్పటికే కొందరు పార్టీ మారిపోయారు. ఈ క్రమంలో పార్టీని పటిష్టం చేసుకునేందుకుచంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా కూడా అవి ఫలించడం లేదు. ఈలోగా కీలక నాయకుడు కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ఆయన కుటుంబ కారణాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆపత్కాలంలో కేసులు చుట్టుముట్టిన సమయంలో పార్టీ ఆయనను పట్టించుకోలేదనే ప్రచారం బాగా సాగుతోంది.
తమను పట్టించుకోలేదని…..
దీంతో అశోక్ గజపతిరాజు వంటి వారు కూడా చంద్రబాబుపై గుస్సాగానే ఉన్నారు. పార్టీలో తాము ఎన్నో దశాబ్దాలుగా ఉన్నామని, అయినా కూడా పార్టీ తమను పట్టించుకోవడం మానేసిందనే భావన సీనియర్లలో ఉంది. దీంతో పార్టీ ఏ పిలుపు ఇచ్చినా. . వారుపెద్దగా స్పందించడం లేదు. ఇదిలావుంటే, రెండు రోజుల కిందటే కాపు నాయకుడు త్రిమూర్తులు పార్టీకి హ్యాండిచ్చారు. అదేసమయంలో మరికొందరు కూడా తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నాయకుడు ఒకరు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారనే వార్త ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.
బేబినాయనపై ఫోకస్……
మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తమ్ముడు బేబీ నాయనను బీజేపీ రాష్ట్ర నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బేబినాయనతో బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో బలమైన నేతకోసం వెతుకుతున్న బీజేపీ.. రంగారావు కుటుంబంపై ఫోకస్ పెట్టింది. మొదట బేబీ నాయన అన్న మాజీ మంత్రి సుజయ్ కృష్ణను సంప్రదించగా ఆయన అనాసక్తితో ఉండడంతో.. ఈ క్రమంలో టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న తన తమ్ముడు చిన్నరాజాగా పేరుగాంచిన బేబీ నాయనతో మాట్లాడగా ఆయన తల పంకించినట్టు చెబుతున్నారు.
బొత్సను చేర్చుకోవడంతో…..
కాగా 2014 లో విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బేబినాయన టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి చెందారు. అదే ఎన్నికల్లో బొబ్బిలి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అన్న సుజయ్కృష్ణ గెలిచారు. ఆ తర్వాత సోదరులు ఇద్దరూ బొత్సను వైసీపీలో చేర్చుకోవడంతో నిరసిస్తూ టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత సుజయ్కు మంత్రి పదవి వచ్చింది. ఇక ఈ ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ సీటు ఆశించారు. సుజయ్ మళ్లీ తానే పోటీకి రెడీ అవ్వడంతో అన్నదమ్ముల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఎన్నికల తర్వాత పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో బేబీ నాయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.
బీజేపీలో చేరితే…..
అయితే ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలో చేరాలని బేబినాయన ప్రయత్నించినట్టు ప్రచారం జరిగింది.. కానీ కుదరకపోవడంతో టీడీపీలోనే ఉన్నారు. తాజాగా బీజేపీ నేతలు ఆయనను సంప్రదిస్తున్న వేళ బేబీ నాయన బీజేపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే.. పార్టీకి ఇబ్బంది కర పరిణామమే అంటున్నారుపరిశీలకలు. మాస్లో మంచి ఇమేజ్ ఉన్న నాయకుడిగా బేబినాయన పేరు తెచ్చుకున్నారు. బేబీ నాయన పార్టీ మారితే బొబ్బిలిలో టీడీపీ కోటకు బీటలు వారినట్టే..!