దుకాణం బంద్ అయినట్లేనా
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దాదాపు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన [more]
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దాదాపు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన [more]
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దాదాపు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన పల్లె.. చంద్రబాబు మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన ఐటీ శాఖకు మంత్రిగా, సమాచార పౌర సంబంధాల శాఖ అమాత్యుడిగా పల్లె రఘునాథరెడ్డి చక్రం తిప్పారు. ఈయన కాలంలోనే జర్నలిస్టులకు కొన్ని మంచి పనులు కూడా జరిగాయనే ప్రచారం ఉంది. అలాంటి నాయకుడు పాలనా పరంగా కొంత దూకుడు ప్రదర్శించలేక పోయారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తెలంగాణతో చంద్రబాబు కంపేర్ చేసుకున్నప్పుడు.. అక్కడ ఐటీ మంత్రిగా సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కుమారుడు ఉన్నారు.
పార్టీనే నమ్ముకుని….
అయితే, ఇక్కడ పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. దీంతో ఆయనను 2017లో తప్పించి.. ఆ ప్లేస్‌ను తన కుమారుడితో భర్తీ చేశారు చంద్రబాబు. అయినా కూడా పల్లె రఘునాథరెడ్డి ఎక్కడా ఆవేదనకు గురికాలేదు. దీంతో చంద్రబాబు ఆయనకు విప్ పదవిని ఇచ్చి గౌరవించారు. ఇక, టీడీపీతోనూ పల్లె రఘునాథరెడ్డికి కొన్ని దశాబ్దాల బంధం ఉంది. పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడకముందు కూడా ఆయన నల్లమడ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాదించారు. ఇలా పార్టీతో ఉన్న అనుభంధం నేపథ్యంలో పదవుల కోసం పరిగెట్టకుండా పార్టీ కోసం పల్లె రఘునాథరెడ్డి కృషి చేశారు. అయితే, వయసు మీద పడటంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్లె రఘునాథరెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో కొన్ని సందేహాలు వచ్చాయి.
ఓటమి పాలుకావడంతో….
పల్లె రఘునాథరెడ్డి హిందూపురం ఎంపీగా పోటీ చేస్తారని.. ఆయన్ను బాబు రాజ్యసభకు పంపుతారన్న టాక్ వచ్చింది. యువ నాయకులు కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే,చంద్రబాబు మాత్రం విధేయతకు వీరతాడు అన్నట్టుగా పల్లె రఘునాథరెడ్డికే టికెట్ కేటాయించారు. విస్తృతంగా ఆయన ప్రచారం చేసినా.. జగన్ సునామీ ముందు ఓటమి తప్పలేదు. పల్లె రఘునాథరెడ్డిపై వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీథర్‌రెడ్డి ఘనవిజయం సాధించారు.
వచ్చే ఎన్నికల నాటికి….
ఇక, ఇటీవల జరిగిన ఎన్నికల నాటికే వయసు మీద పడడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయన పరిస్థితి ఏంటనేది నేటి చర్చ. పోనీ.. పల్లె రఘునాథరెడ్డికి ఏమైనా నామినేటెడ్ పదవులు ఇద్దామన్నా.. అసెంబ్లీలో టీడీపీకి వచ్చిన సంఖ్యాబలాన్ని బట్టి నామినేటెడ్ పదవులు దక్కే ఛాన్స్ లేదు. దీంతో పార్టీలోనే ఏమైనా పదవులు ఇవ్వడం మినహా మిగిలింది శూన్యం. ఈ నేపథ్యంలోనే ఇక, పల్లె రఘునాథరెడ్డి రిటైర్మెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అదే జరిగితే పుట్టపర్తిలో టీడీపీని నడిపించే నాయకుడు కరువవుతాడు. మరి అధినేత నిర్ణయం.. పల్లె రఘునాథరెడ్డి ఆలోచన ఎలాఉందో చూడాలి.