జనాలను టార్గెట్ చేస్తున్న తమ్ముళ్ళు ..?
ఆడలేక మద్దెల ఓడు అని వెనకటికి ఒక ముతక సామెత ఉంది. ఇపుడు అది అచ్చంగా తెలుగుదేశం తమ్ముళ్లకు సరిపోతుంది. ఎందుకంటే జనాలు ఓట్లేస్తే అధికారిక దర్జా [more]
ఆడలేక మద్దెల ఓడు అని వెనకటికి ఒక ముతక సామెత ఉంది. ఇపుడు అది అచ్చంగా తెలుగుదేశం తమ్ముళ్లకు సరిపోతుంది. ఎందుకంటే జనాలు ఓట్లేస్తే అధికారిక దర్జా [more]
ఆడలేక మద్దెల ఓడు అని వెనకటికి ఒక ముతక సామెత ఉంది. ఇపుడు అది అచ్చంగా తెలుగుదేశం తమ్ముళ్లకు సరిపోతుంది. ఎందుకంటే జనాలు ఓట్లేస్తే అధికారిక దర్జా చేసే నాయకులు అదే జనాలు పక్క పార్టీని అందలం ఎక్కిస్తే మాత్రం అసలు తట్టుకోలేరు. ఆ ప్రజలు ఓడిన నేతలకు ఒక్కసారిగా చెడ్డ అయిపోతారు. ఈ రకమైన దుర్నీతిని ప్రజాస్వామ్యంలో తీసుకునిరావడం దారుణం. కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు తమ అక్కసుని వెళ్ళగక్కడానికి వ్యవస్థలతో పాటు ప్రజలను నిందిస్తున్నారు. వీలు దొరికినపుడల్లా జనాలకు ఏకిపారేస్తున్నారు.
బాబుతో మొదలు…
నిజానికి ఇప్పటిదాకా ఓడిపోయిన వారు ఎవరూ జనాలకు విమర్శించిన చరిత్ర లేదు. రాజకీయాన్నే వారు చూసుకున్నారు. కానీ 2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం అధినాయకుడు బాబు కొత్త థియరీని కనిపెట్టారు. అదే ప్రజలను కూడా నిందించడం. ప్రజలు సరిగ్గా తీర్పు ఇవ్వలేదు. వారు కూడా పనిచేసిన వారిని పట్టుకుని ఓడించారు. ప్రజల తీర్పు బాగు లేదు అంటూ బాబు అవకాశం ఉన్నపుడల్లా తిడుతూ పోతున్నారు. దాన్ని అందిపుచ్చుకున్న తమ్ముళ్ళు కూడా ఓడిన తప్పు మాది కాదు ప్రజలదే అంటూ కొత్త సిధ్దాంతాన్ని తెర మీదకు తెస్తున్నారు. వైసీపీ మీరు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి అనుభవించండి అంటూ శాపనార్ధాలు పెట్టే వారూ తయారయ్యారు.
పిరికివారుట ….
చంద్రబాబు తాజాగా విశాఖ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తన సభకు వచ్చిన ప్రజలను పట్టుకుని ముఖం మీదే మీరు వట్టి పిరికివారు అంటూ విమర్శించారు. విశాఖలో వైసీపీ అరాచకాలను ఎదుర్కోలేక గమ్మునుంటున్నారు. తుపాకీలను చూస్తే పారిపోతారు అంటూ ఎకసెక్కమే ఆడారు. అవును మరి ప్రజలు ఏం చేస్తారు. ప్రజాస్వామ్యంలో వారు పాత్ర ఓటు వేయడం వరకే. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయరు కదా. ఇక రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించి ఉద్యమాలు చేస్తే ఆయా వర్గాలకు చెందిన వారు పాలు పంచుకుంటారు. కానీ ప్రజలే లీడ్ తీసుకోరు కదా. ఇవన్నీ తెలిసినా కూడా తెలుగుదేశం పార్టీని ఓడించారు అన్న అక్కసుతోనే బాబు ఈ రకమైన కామెంట్స్ చేశారు అంటున్నారు.
మూగ జీవాలుట…
ఇపుడు ఆయన గారి అనుంగు తమ్ముడు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత వర్ల రామయ్య అయితే విశాఖ జనాలను మూగ జీవాలతో పోల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద పాదయాత్రను ఎంపీ విజయసాయిరెడ్డి చేపడితే జనం ఆయన వెనక మూగ జీవాలుగా అనుసరించారు అంటూ వర్ల రామయ్య సెటైర్లు వేశారు. విజయసాయిరెడ్డి జనాలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ విశాఖ జనాల మీద కామెంట్స్ చేయడమే సరిగ్గా లేదని మేధావులు అంటున్నారు. మొత్తానికి రాజకీయాలను ఆ పార్టీ వారూ వీరూ చూసుకోకుండా మధ్యలో ఓట్లేసిన ప్రజలను తీసుకువచ్చి తిట్ల పురాణం అందుకోవడం అంటే పాలిటిక్స్ ఎటు పోతోందో అర్ధం కావడంలేదు కదా.