టిడిపికి అందులో అరుదైన రికార్డ్
ఒక్కరోజులో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, బిజెపి రాజ్యసభ్యులుగా అవతరించిన వారిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీవారే ఇలా ఎక్కువగా గోడ [more]
ఒక్కరోజులో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, బిజెపి రాజ్యసభ్యులుగా అవతరించిన వారిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీవారే ఇలా ఎక్కువగా గోడ [more]
ఒక్కరోజులో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, బిజెపి రాజ్యసభ్యులుగా అవతరించిన వారిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీవారే ఇలా ఎక్కువగా గోడ దూకిన నేపధ్యం గమనిస్తే ఆ పార్టీ లో ఉండేవారికి విధేయత అనే మాటకు అధికారంలో వున్నప్పుడే కనిపిస్తుంది వినిపిస్తుంది తప్ప అధికారం కోల్పోతే మాత్రం అభివృద్ధి కోసం అంటూ జంప్ జిలానీలు కావడమే రివాజుగా వస్తుంది. పార్టీ ఫిరాయింపుల్లో దేశంలో తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులది అరుదైన రికార్డ్ నే వుంది. ముఖ్యంగా రాజ్యసభ కు ఎంపిక చేసిన అభ్యర్థులైతే ఆ పార్టీకి ఎప్పుడు అచ్చిరాలేదని గత చరిత్ర చాటిచెబుతుంది. నమ్మిన పార్టీని నట్టేట ముంచడంలో టిడిపి ఎంపీలు ఎప్పుడు ముందు వుంటూ దేశవాసుల్లో ఆ పార్టీకి అప్రతిష్ట పాలు చేస్తూనే వచ్చారు.
ఇదిగో లిస్ట్ …
వీరిలో పార్టీ ప్రారంభమైన నాటినుంచి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు గా ఎంపికయ్యి జంప్ అయిన వారిలో పర్వతనేని ఉపేంద్ర, వైశ్రాయి ప్రభాకర రెడ్డి, రేణుకా చౌదరి, జయప్రద, మోహన్ బాబు, విజయ మోహన రెడ్డి. రుమాండ్ల రామచంద్రయ్య, తులసి రెడ్డి, సి రామచంద్రయ్య, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, వున్నారు. రామ ముని రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వం ముగిసాకా పార్టీ కార్యకలాపాలకు దూరం అయిపోయారు. కడప జిల్లా నుంచి ఐదుగురుని రాజ్యసభకు టిడిపి పంపితే వారిలో నలుగురు తులసిరెడ్డి, రామచంద్రయ్య, ఎం వి మైసూరా రెడ్డి, సిఎం రమేష్ లు జారిపోయారు. పెద్దల సభకు వెళ్ళి పార్టీని అంటిపెట్టుకున్న వారిలో యడ్లపాటి వెంకట రావు, కంభంపాటి రామ్మోహన రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటివారే వున్నారు.
ఎన్టీఆర్ టైం లో పివి కొట్టారు దెబ్బ ...
టిడిపి విపక్షంలో వున్న సమయంలో 1992 లో ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆరుగురు టిడిపి పార్లమెంట్ సభ్యులను ఆకర్షించారు. విజయ కుమార్ రాజు సారధ్యంలో నాడు దేశాన్ని కాపాడటం కోసం, అభివృద్ధి కోసమంటూ వారు ఫిరాయించి టిడిపికి గట్టి షాక్ నే ఇచ్చారు. ఆ తరువాత కూడా మందా జగన్నాధం వంటివారు యుపిఎ సర్కార్ కి కీలక సమయాల్లో అండగా నిలిచి సొంత పార్టీకి దెబ్బ కొట్టేశారు. ఇలా పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు మరీ దారుణంగా, లోక్ సభలో కూడా టిడిపి సభ్యులు అధికారపార్టీకి లోకువగా దొరికేస్తూ ముఖ్యంగా అధికారం కోల్పోయిన సమయంలో అధినేతను పార్టీ క్యాడర్ కు క్షోభ కలిగిస్తున్నారు.