వైసీపీ సౌండ్ పెంచిందిగా ?
రాజకీయాల్లో ప్రతీ సౌండ్ కి ఒక రీసౌండ్ వస్తుంది. ఏ సౌండ్ ఏ టైంలో చేయాలో తెలిసిన వారికే రాజకీయం రాచబాట అవుతుంది. ఇక అన్ని సౌండ్లూ [more]
రాజకీయాల్లో ప్రతీ సౌండ్ కి ఒక రీసౌండ్ వస్తుంది. ఏ సౌండ్ ఏ టైంలో చేయాలో తెలిసిన వారికే రాజకీయం రాచబాట అవుతుంది. ఇక అన్ని సౌండ్లూ [more]
రాజకీయాల్లో ప్రతీ సౌండ్ కి ఒక రీసౌండ్ వస్తుంది. ఏ సౌండ్ ఏ టైంలో చేయాలో తెలిసిన వారికే రాజకీయం రాచబాట అవుతుంది. ఇక అన్ని సౌండ్లూ ఒక్కలా ఉండవు. అధికార పార్టీ చేసే సౌండ్ కే విలువా, వాల్యూం ఎక్కువ. విషయానికి వస్తే ఏపీలో ఇపుడు టీడీపీ వర్సెస్ వైసీపీ పాలిటిక్స్ రంజుగా సాగుతోంది. వరసగా తమ నేతలను తీసుకువచ్చి జైళ్ళల్లో పెట్టేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు గోల పెడుతున్నారు. ఇది దారుణమని ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు. ఆ విధంగా జనంలో సానుభూతి పొందాలన్నది టీడీపీ స్ట్రాటజీ.
దూకుడే ….
అయితే టీడీపీ చేస్తున్న ఈ రాజకీయాన్ని గమనించలేనంత వెనకబడి లేదు వైసీపీ. అందుకే రిటార్టులు బాగానే ఉంటున్నాయి. ఇది వట్టి ట్రైలర్, దీనికే బెంబేలెత్తిపోతే చంద్రబాబూ అంటూ దీర్ఘాలు తీస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ముందుంది అసలైన ముసళ్ల పండుగ అని కూడా భయపెట్టేస్తున్నారు. నాలుగేళ్ల పాటు మొత్తం సినిమావే చూపిస్తాం, ఇక మీరు తట్టుకోలేరూ అంటూ గర్జిస్తున్నారు కూడా.
ఇలాగేనట ….
ఇది ఇలాగే జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతుంది. ఇంతటితో ఆపేయడానికి ఇది మీ పాలన కాదు, మా జమానా అంటున్నారు వైసీపీ మంత్రులు. అవినీతి ఆరోపణలు చేస్తే మాత్రం అరెస్టులు తప్పవు, చట్టం ఎవరికీ చుట్టం కాదు, గతంలో చేసిన పాపాలే శాపాలు అవుతాయి తప్ప మేము కొత్తగా చేసిందీ చేర్చిందీ ఏదీ లేదని మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు. పాలనను గాడిలో పెడుతున్నామని, ఎక్కడైనా దందాలు జరిగినా, కబ్జాలు చేసినట్లుగా తమ ప్రభుత్వ ద్రుష్టికి వచ్చినా వెంటనే యాక్షన్లోకి దిగిపోతామని కూడా హెచ్చరిస్తున్నారు.
ముళ్ళబాటేనా…?
రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇస్తే ఆగిపోతుందనుకుంటే పొరపాటేనని కూడా ఈ విధంగా వైసీపీ సర్కార్ పెద్దలు తేల్చి చెప్పేస్తున్నారు. . అక్రమాలు, అవినీతి చేస్తే జైల్లో పెట్టకుండా ఇంట్లో ఉంచుతారా. రోజూ మీరు తిడుతూంటే ఊరకే మేము పడాలా, తగిన చర్యలతో ప్రజల ముందే అసలు దోషులను పెడతామని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి టీడీపీ పాలనలో మాజీ మంత్రులుగా చేసిన వారికి తాజా పరిణామాలు బెంబేలెత్తిస్తున్నారు. గత సంప్రదాయాలు భిన్నంగా రాజకీయ మొహమాటాలు, స్నేహాలకు అతీతంగా దొరికిన వారిని దొరికినట్లే కటకటాల వెనక్కి నెట్టాలన్న దూకుడుతో వైసీపీ ఉంది. దీంతో టీడీపీకి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయినా సినిమాను చూపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు, చూడాల్సిందే మరి.