ఆ విషయంలో టీడీపీ సక్సెస్ అయినట్లే?
తెలుగుదేశం పార్టీ ఒక విషయంలో మాత్రం సక్సెస్ అవుతుంది. ప్రజల్లోకి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం తీసుకు వెళ్లడంతో మాత్రం ఇప్పటివరకూ విజయవంతమయిందనే చెప్పాలి. అయితే ఈ [more]
తెలుగుదేశం పార్టీ ఒక విషయంలో మాత్రం సక్సెస్ అవుతుంది. ప్రజల్లోకి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం తీసుకు వెళ్లడంతో మాత్రం ఇప్పటివరకూ విజయవంతమయిందనే చెప్పాలి. అయితే ఈ [more]
తెలుగుదేశం పార్టీ ఒక విషయంలో మాత్రం సక్సెస్ అవుతుంది. ప్రజల్లోకి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం తీసుకు వెళ్లడంతో మాత్రం ఇప్పటివరకూ విజయవంతమయిందనే చెప్పాలి. అయితే ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో మాత్రం వైసీపీ వెనకబడిందనే చెప్పాలి. అబద్దాలను నిజం చేయడంలోనూ, నిజాలను అబద్దం చేయడంలోనూ దిట్టలు ఏపీ రాజకీయ నేతలు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వరసగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేందుకు అన్ని యుక్తులూ ప్రదర్శిస్తారు.
దేవాలయాలపై దాడులు…
కొంతకాలం క్రితం దేవాలయాలపై దాడులతో ఏపీ అట్టుడికి పోయింది. అంతర్వేది రధం దగ్దం ఘటన, విజయవాడ కనకదుర్గమ్మ గుడి రధంలో వెండి సింహాల మాయంతో పాటు అనేక దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. నిజానికి ఆకతాయిలు చేసిన పనికి ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి. వీటిని బీజేపీ,జనసేన, టీడీపీలు తమకు అనుకూలంగా మలచుకనేందుకు ప్రయత్నించాయి.
దళితులపై దాడులు…..
అయితే ఈ ఘటనలపై జగన్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది. అంతర్వేదిలో నూతన రధానికి కూడా నిధులు కేటాయించారు. ఇప్పుడు ఆ వివాదాలేమీ లేవు. ఇక ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద దాడులంటూ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. డాక్టర్ సుధాకర్ నుంచి మొన్నటి కలాం వరకూ ప్రభుత్వ దాడులుగానే విపక్షాలు అభివర్ణించాయి. ఇప్పుడు అవి కూడా క్రమంగా మరుగునపడినట్లే కన్పిస్తుంది.
పోలవరం ఎత్తు…..
ఇక పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ఇటీవల విపక్షాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. పోలవరం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత పెట్టినందున ఎత్తు తగ్గించి ఆదా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందన్న ప్రచారం చేస్తుంది. ఇప్పటికే ఈ విషయం ప్రజల్లోకి వెళ్లింది. వామపక్షాలయితే చలో పోలవరానికి పిలుపునిచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం తాము అంగుళం కూడా తగ్గించబోమని చెబుతోంది. మంత్రివర్గ సమావేశంలోనూ జగన్ చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలోకి మాత్రం విపక్షాలు చేస్తున్న విమర్శలే ఎక్కువగా వెళుతుండటం విశేషం. వైసీపీ ఇదే తరహా నిర్లక్ష్యం వహిస్తే క్షేత్రస్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదు.