క్లారిటీ లేకుండానే టూర్ స్టార్ట్ అవుతుందా …?
టీం ఇండియా వెస్ట్ ఇండీస్ టూర్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. ఒక పక్క టీం లోని కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ ల నడుమ అంతర్యుద్ధం [more]
టీం ఇండియా వెస్ట్ ఇండీస్ టూర్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. ఒక పక్క టీం లోని కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ ల నడుమ అంతర్యుద్ధం [more]
టీం ఇండియా వెస్ట్ ఇండీస్ టూర్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. ఒక పక్క టీం లోని కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ ల నడుమ అంతర్యుద్ధం పై స్పష్టత లేకుండా టూర్ కి సన్నద్ధతపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కోహ్లీ, రోహిత్ నడుమ ఎలాంటి వివాదం లేదని కెప్టెన్ చేత చెప్పించడంలో బిసిసిఐ ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. దాంతో ఇద్దరు కీలక ఆటగాళ్ళ నడుమ వార్ మాములుగా లేదని సాగుతున్న ప్రచారం మరింత పెరిగింది. అసలే ప్రపంచ కప్ సెమిస్ లో చతికిలపడి ఆత్మస్థైర్యం దెబ్బతిని వున్న టీంకు ఈ పరిణామాలు ఇబ్బందికరమే.
అదేనా కోహ్లీ భయం ….
వాస్తవానికి వెస్ట్ ఇండీస్ టూర్ కి కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలన్నది ముందుగా అనుకున్నది. కోహ్లీ ప్లేస్ లో రోహిత్ వన్డే , టి ట్వంటీ లకు సారధ్యం వహించాలి. టెస్ట్ లకు కోహ్లీ కి నాయకత్వం అప్పగించాలని బిసిసిఐ ప్లాన్ . అయితే విరాట్, రోహిత్ నడుమ సఖ్యత దెబ్బతినడం వెస్ట్ ఇండీస్ టూర్ కి రోహిత్ కెప్టెన్ అవుతాడన్న ఆందోళనతోనే కోహ్లీ తన నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. టోర్నీ కి రెడీ అని బిసిసిఐ కి విరాట్ స్పష్టం చేయడం గమనిస్తే వీరిద్దరి గొడవ గట్టిగానే నడుస్తుందని క్రీడా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. టూర్ మొదలై ముందు కెప్టెన్ మీడియా సమావేశం పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. పాత్రికేయులనుంచి ఎదురయ్యే ప్రశ్నల వర్షానికి చిక్కడం ఇష్టం లేకపోవడంతో కోహ్లీ అదేమీ నిర్వహించకుండానే వెస్ట్ ఇండీస్ కి బయలుదేరేందుకు సిద్ధం కావడం గమనార్హం.
బిసిసిఐ చెక్ పెట్టాలి….
ఫామ్ పరంగా చూసుకుంటే కెప్టెన్ , వైస్ కెప్టెన్ లు ఇరువురు భీకర ఫామ్ లోనే వున్నారు. వరల్డ్ కప్ లో సైతం ఇద్దరు సెమిస్ తప్ప అన్ని మ్యాచ్ లలో దుమ్ము లేపారు. ప్రపంచ టాప్ బ్యాట్స్ మెన్ లలో అగ్రస్థానంలోనే వున్నారు. అలాంటి ఇద్దరు టీం స్పిరిట్ ని పక్కన పెట్టి పంతాలు పట్టింపులకు పోవడం సగటు భారత క్రికెట్ అభిమానిని తీవ్రంగా బాధపెడుతోంది. మరి రెండు వర్గాలుగా వున్న టీం ఇండియా ను ఒక్కటిగా చేయడానికి బిసిసిఐ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.