కలవడం వరకూ ఓకే.. లీడర్ అంటే నో
బీహార్ ఎన్నికల నగారా మోగింది. అయితే విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు ఇంతవరకూ చేసుకోలేదు. దీనికి తోడు విపక్ష కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారన్నది ప్రశ్నగా మారింది. [more]
బీహార్ ఎన్నికల నగారా మోగింది. అయితే విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు ఇంతవరకూ చేసుకోలేదు. దీనికి తోడు విపక్ష కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారన్నది ప్రశ్నగా మారింది. [more]
బీహార్ ఎన్నికల నగారా మోగింది. అయితే విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు ఇంతవరకూ చేసుకోలేదు. దీనికి తోడు విపక్ష కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారన్నది ప్రశ్నగా మారింది. బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ కు మంచి పట్టుంది. లాలూ ప్రసాద్ యాదవ్ కు సానుభూతి కూడా బాగా ఉంది. జైలులో ఉన్న కారణంగా సహజంగానే ఆర్జేడీ పట్ల ఒక వర్గం ఓటర్లు ఆకర్షితులవుతారన్నది విశ్లేషకుల అంచనా. అయితే బీహార్ లో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని మాత్రం కూటమి పార్టీలే అంగీకరించడం లేదు.
నాయకత్వానికి మాత్రం…..
సహజంగా ఒక కూటమి ఏర్పడిందంటే దానికి ఒక నాయకత్వం ఉండాలి. లాలూప్రసాద్ యాదవ్ జైలులో ఉండటంతో ఆయన తనయుడు ఆర్జేడీకి నాయకత్వం వహిస్తున్నారు. బీహార్ లో పెద్దగా బలం లేని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సయితం ఆర్జేడీ వెంట నడవాల్సిందే. కూటమికి నాయకత్వం వహించేటంత సీన్ కాంగ్రెస్ కు బీహార్ లో లేదనే చెప్పాలి. దీంతో ఆటోమేటిక్ గా తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే కూటమి నడవాల్సి ఉంటుంది. ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.
క్లీన్ ఇమేజ్ లేకపోవడంతో….
బీహార్ ది చిత్రమైన రాజకీయం. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల వెంట నడవాల్సిందే. దేశమంతటా కాలరెగరేస్తున్న కాషాయ పార్టీ సయితం జేడీయూ నాయకత్వంలో పనిచేయాల్సిందే. నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ సయితం ఆర్జేడీ లేకుండా మనలేదు. అయితే నితీష్ కుమార్ కు ఉన్నంత చరిష్మా, క్లీన్ ఇమేజ్ తేజస్వి యాదవ్ కు లేదు. వయసుచిన్నది కావడంతో ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు కూటమిలోని పార్టీలే అంగీకరించడం లేదు.
ఫలితాల తర్వతేనంటున్న…….
ఆర్జేడీ నాయకత్వంలో పనిచేయడానికి తమకు ఇష్టమేనని, కానీ తేజస్వి నాయకత్వంలో పనిచేయడానికి సుముఖంగా లేమని కూటమిలోని ఒక పార్టీ అయిన లోక్ సమతా పార్టీ నేత ఉపేంద్ర కుశ్వహా కుండబద్దలు కొట్టేశారు. ఆర్జేడీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వియాదవ్ పేరును ప్రకటించాలని పట్టుబడుతుంది. దీనికి కాంగ్రెస్ తో సహా కూటమి పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయిద్దామని కాంగ్రెస్ అంటోంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది.