తేజస్వి కి పెరుగుతున్న క్రేజ్..కారణమిదే?
బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ విజయం సాధించినట్లే చెప్పుకోవాలి. ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ యేతర పార్టీల అగ్రనేతలందరూ తేజస్వి యాదవ్ ను పొగడ్తలతో [more]
బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ విజయం సాధించినట్లే చెప్పుకోవాలి. ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ యేతర పార్టీల అగ్రనేతలందరూ తేజస్వి యాదవ్ ను పొగడ్తలతో [more]
బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ విజయం సాధించినట్లే చెప్పుకోవాలి. ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ యేతర పార్టీల అగ్రనేతలందరూ తేజస్వి యాదవ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పెద్ద రాష్ట్రమైన బీహార్ లో ఆర్జేడీ కూటమిని తేజస్వి యాదవ్ ఒంటిచేత్తో నడిపించారు. మెహబూబ్ ముఫ్తీ లాంటి నేతలు సయితం తేజస్వియాదవ్ నైతికంగా గెలిచినట్లేనని, మోదీ కూటమి ఓడిపోయినట్లేనని వ్యాఖ్యలు చేస్తున్నారు.
సోషల్ మీడయాలో….
ఇక సోషల్ మీడియా సంగతి చెప్పనక్కర లేదు. మోదీని ధీటుగా ఎదుర్కొన్న 31 ఏళ్ల యువకుడంటూ తేజస్వి యాదవ్ పై ప్రశంలసు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వన్ సైడ్ తేజస్వికి మద్దతుగా పోస్టింగ్ లు పెడుతున్నారు. నితీష్ కుమార్ ఓడిపోయినట్లేనని, ఆయన గద్దె దిగి వెళ్లిపోతే మంచిదన్న కామెంట్స్ కూడా కనపడుతున్నాయి. నిజానికి ఆర్జేడీ కూటమికి, ఎన్డీఏ కూటమికి ఓట్ల మధ్యలోపెద్ద తేడా లేకపోవడం కూడా గమనార్హం.
ఇరవై నియోజకవర్గాల్లో….
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 125 సీట్లు రాగా, ఆర్జేడీ కూటమికి 110 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 122 మాత్రమే. ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కంటే మూడు స్థానాలు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే ఆర్జేడీ అభ్యర్థులు ఇరవై నియోజకవర్గాల్లో కేవలం వంద లోపు ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని తేజస్వి యాదవ్ ఆరోపిస్తున్నారు.
అన్నీ ఇబ్బందులే….
మరోవైపు తేజస్వి యాదవ్ కు అన్ని ఇబ్బందులే ఎదురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోవడం ఒక కారణం కాగా, ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలవడమే కాకుండా ఆర్జేడీ ఓట్లను గణనీయంగా చీల్చగలిగింది. ఇక చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జన్ శక్తి పార్టీ సయితం ఆర్జేడీ ఓట్లనే ఎక్కువగా చీల్చింది. ఈ కారణాల వల్లనే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాలేకపోయారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద తృటిలో అధికారాన్ని కోల్పోయినా తేజస్వి యాదవ్ పై దేశ వ్యాప్తంగా పార్టీల కతీతంగా విమర్శలు విన్పిస్తున్నాయి.