మంత్రివర్గంలో స్థానం వీరికేనా..?
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది. డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కెసీఆర్, మహమూద్ ఆలీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి గమ్మున ఉన్నారు. ఆ [more]
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది. డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కెసీఆర్, మహమూద్ ఆలీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి గమ్మున ఉన్నారు. ఆ [more]
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది. డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కెసీఆర్, మహమూద్ ఆలీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి గమ్మున ఉన్నారు. ఆ తరువాత ముహూర్తాలు లేని కారణంతో సంక్రాంతి తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. జనవరి కూడా వచ్చి వెళ్లింది. కానీ మంత్రి వర్గ విస్తరణ మాత్రం ఇంతవరకు జరపకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఫిబ్రవరిలో అమావాస్య తరువాత పదవుల పందేరం ఉంటుందని అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు కూడా.
ఈనెల 10న ముహూర్తం …
ఈనెల 10న ఆదివారం మంచి రోజు కావడంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కెసిఆర్ రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. కేవలం 10 మంది మంత్రులతో గులాబీ బాస్ తన టీంను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. అయితే ఈ టీంలో ఈసారి మేనల్లుడు హరీష్ రావు, కుమారుడు కెటిఆర్ ఉండకపోవొచ్చని కూడా టాక్ వస్తుంది. కుటుంబ పాలనగా టీఆర్ఎస్ నడుస్తుందంటూ పెద్దఎత్తున విమర్శలు చెలరేగుతూ ఉండటంతో గులాబీ బాస్ సరికొత్త నిర్ణయం తీసుకుని బంధువర్గాన్ని పక్కన పెట్టనున్నట్లు చెబుతున్నారు. పాత మంత్రుల్లో తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్వర రెడ్డి, ఈటెల రాజేందర్ ఉంటారని కొత్తవారితో కెసిఆర్ సర్కార్ నడిపిస్తారని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం నాన్చకుండా తేల్చేసేందుకే గులాబీ చీఫ్ డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. పదవులు ఆశించే నేతలకు ఆదివారం పండగే మరి.