కేసీఆర్ విశ్వరూపం చూసి జగన్ ఫుల్ సైలెంట్… ?
కేసీఆర్ ని అద్భుతమైన వ్యూహకర్తగా చెబుతారు. చంద్రబాబు చాణక్య రాజకీయానికి కూడా బ్రేకులు వేసి షేక్ చేసిన ఘనత కేసీఆర్‌దే. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు [more]
కేసీఆర్ ని అద్భుతమైన వ్యూహకర్తగా చెబుతారు. చంద్రబాబు చాణక్య రాజకీయానికి కూడా బ్రేకులు వేసి షేక్ చేసిన ఘనత కేసీఆర్‌దే. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు [more]
కేసీఆర్ ని అద్భుతమైన వ్యూహకర్తగా చెబుతారు. చంద్రబాబు చాణక్య రాజకీయానికి కూడా బ్రేకులు వేసి షేక్ చేసిన ఘనత కేసీఆర్‌దే. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు వ్యూహాలకు ఎన్టీఆర్ లాంటి వాళ్లే చిత్తయ్యారు. ప్రధానమంత్రులను సైతం కొంత వరకు కంట్రోల్ చేసిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి చంద్రబాబునే గింగరాలు తిరిగేలా చేశారు కేసీఆర్. అటువంటి కేసీఆర్ ని జగన్ గుడ్డిగా నమ్మేశారు. తాను నిండా మునిగారు. ఇక అయిదు కోట్ల ఏపీ కూడా మునిగిపోయింది. కేసీఆర్ ఉమ్మడి ఏపీ విభజనను ఎలా సాధించారో తెలుసుకుంటే చాలు ఆయన రాజకీయ లౌక్యం అర్ధమవుతుంది. కేంద్రంలోని మహా మహా జాతీయ పార్టీలకే ఆయన చుక్కలు చూపించారు.
ఏపీకి అంతా నష్టమే…?
ఇపుడు ఏపీ పాలకులను ఆయన ఒక ఆట ఆడిస్తున్నారు. 2014 లో జగన్ ఏపీకి సీఎం కావాలని కేసీఆర్ కోరుకున్నారు. దానికి కారణం తెలంగాణాలో తాను ఏం చేసినా పక్క రాష్ట్రం అడ్డు చెప్పకూడదు అన్న భావనతోనే తప్ప ప్రేమతో కాదు. ఇక కేసీఆర్ కి చంద్రబాబు పవర్ లోకి వచ్చినా కూడా ఆయన్ని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏడాది లోపే పంపించేయడానికి ఓటుకు నోటు కేసు బాగా దొరికింది. దీంతో చంద్రబాబు ఏమనలేక పరిస్థితి వస్తే మరో వైపు కృష్ణా నది మీద అక్రమ ప్రాజెక్టులకు తెలంగాణా సర్కార్ ఆ టైమ్ లోనే తెర లేపింది. ఇవన్నీ ఇలా ఉండగా ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. దాంతో తెలంగాణాలోని దాదాపు గా 210 దాకా ఏపీ ఆస్తుల విషయంలో జగన్ సర్కార్ ఏమీ అనకుండా తనదైన చెలిమి మత్తులో ముంచేశారు.
విద్యుత్తు బకాయీలు కూడా….?
అంతే కాదు ఏడు వేల కోట్ల విద్యుత్ బిల్లుల విషయంలోనూ గట్టిగా అడకుండా చేసుకున్నారు. బేసిన్లూ లేవు, భేషజాలూ లేవంటూ జగన్‌ను నమ్మించారు. దాంతో రాయలసీమ ఎత్తుపోతల పధకానికి జగన్ శ్రీకారం చుడితే అది సాకుగా చూపించి ఇపుడు ఏకంగా కృష్ణా జలాల మీద తన మాటే నెగ్గాలని కేసీఆర్ పంతం పడుతున్నారు. ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా ఇవ్వాల్సిందే అంటూ పేచీలు పెడుతున్నారు. మరో వైపు చూస్తే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరం అయిన విద్యుత్తు కి కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారానే నీరు తీసుకుని విద్యుతు ఉత్పత్తి చేసేందుకు కూడా చక్కని స్కెచ్ గీసుకున్నారు.
అనుకున్నది సాధిస్తూ….
ఏమి చేసినా కూడా కేసీఆర్ అనుకున్నది సాధిస్తున్నారు. ఇక జగన్ విషయంలో ఆయనకు ఏ రకమైన రాజకీయ అవసరాలూ ఇపుడు లేవు అంటున్నారు. తెలంగాణాలో ఓట్ల చీలికతో మళ్లీ అధికారంలోకి రావచ్చు అన్నదే ఆయన ఆలోచన. దాంతో జగన్ సామాజిక వర్గం తెలంగాణాలో తనకు మద్దతు ఇవ్వాలన్న కంపల్సరీ అయితే కేసీఆర్‌కు ఇప్పుడు లేదు. రేవంత్ ఎంట్రీతో కేసీఆర్ మిగిలిన కులాలను కేంద్రంగా చేసుకుని రాజకీయం మొదలు పెట్టేశారు. మొత్తానికి కేసీఆర్ ను ఫుల్లుగా నమ్మిన జగన్ ఇపుడు ఫుల్ సైలెంట్ కావాల్సి వచ్చింది.