కేసీఆర్ కు అదే కలసి వస్తుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదే కలసి వస్తుంది. ఏపీలో మాదిరిగా విపక్షాలన్నీ ఒక్కటిగా ఇక్కడ ఉండవు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ నిప్పూ ఉప్పూలా ఉంటాయి. కాంగ్రెస్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదే కలసి వస్తుంది. ఏపీలో మాదిరిగా విపక్షాలన్నీ ఒక్కటిగా ఇక్కడ ఉండవు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ నిప్పూ ఉప్పూలా ఉంటాయి. కాంగ్రెస్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదే కలసి వస్తుంది. ఏపీలో మాదిరిగా విపక్షాలన్నీ ఒక్కటిగా ఇక్కడ ఉండవు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ నిప్పూ ఉప్పూలా ఉంటాయి. కాంగ్రెస్ కు తెలంగాణలో బలం ఉంది. ఏపీలో మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలున్నాయి. వామపక్షాలకు, కాంగ్రెస్ కు అక్కడ పెద్దగా బలం లేదు. తెలంగాణలో విపక్షాలు విడివిడిగా పోటీ చేయడమే కేసీఆర్ కు కలసి వస్తుందంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో మహాకూటమిగా కాంగ్రెస్ తో కలసి ఇతర పార్టీలు జత కట్టినా బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది.
త్వరలో జరగబోయే…..
ఇప్పుడు త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికలోనూ కేసీఆర్ కు అదే కలసి వచ్చే అంశమని చెప్పక తప్పదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం అధికార టీఆర్ఎస్ కు లాభం తప్పకుండా తెచ్చిపెడుతుంది. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికతో పాటు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. నల్లగొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి.
కోదండరామ్ కు మద్దతు?
ఈ ఎన్నికల్లో నల్లగొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ పోటీ చేయాలనుకుంటున్నారు. అన్ని పార్టీలు కలసి ఆయనకు మద్దతిస్తే గెలుపు ఖాయమవుతుంది. కానీ ఇక్కడ బీజేపీ బరిలోకి దించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే సన్నాహక సమావేశాలను ప్రారంభించింది. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, జి.మనోహర్రెడ్డిలలో ఒకరికి టిక్కెట్ దక్కే అవకాశముంది.
విడివిడిగా పోటీ…..
ప్రొఫెసర్ కోదండరామ్ ఎటూ ఆయన అందరి మద్దతును కూడగట్టుకొనేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని పోటీకి దింపాలని దాదాపుగా నిర్ణయించింది. కోదండరామ్ కు వదిలేయడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదు. దీంతో కాంగ్రెస్ కూడా అనివార్యంగా పోటీకి దిగే అవకాశముంది. ఇక తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా పోటీకి సై అంటున్నారు. దీంతో ఈ స్థానంలో విపక్షాలన్నీ అధికార పార్టీ వ్యతిరేక ఓటను చీల్చుకుని కేసీఆర్ పార్టీకి అనుకూలంగా మానుందన్నది విశ్లేషకుల అంచనా.