ఈ ఇద్దరిలో ఒకరికేనట.. ఛాయిస్ మాత్రం?
తెలంగాణలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. మరో నాలుగేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేవు. పీసీసీ అధ్యక్ష పదవి రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఎన్నికల నాటికి మరో [more]
తెలంగాణలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. మరో నాలుగేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేవు. పీసీసీ అధ్యక్ష పదవి రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఎన్నికల నాటికి మరో [more]
తెలంగాణలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. మరో నాలుగేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేవు. పీసీసీ అధ్యక్ష పదవి రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఎన్నికల నాటికి మరో పీసీసీ అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది. అయినా సరే పీసీసీ అధ్యక్ష పదవి కోసం మాత్రం పోటీ కాంగ్రెస్ లో బాగానే ఉంది. దాదాపు పన్నెండు మంది పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే అందులో ఇద్దరు మాత్రం అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ నియామకంపై ఇప్పటికే అధిష్టానం దృష్టి పెట్టింది.
కొద్దో గొప్పో బలం ఉన్న…..
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత కొద్దో గొప్పో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణాలో మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేని పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణా పీసీసీ చీఫ్ నియామకంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే ముఖ్యనేతల అభిప్రాయాలను సేకరించింది. మొత్తం పన్నెండు మంది పోటీలో ఉండగా పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు ముందు వరసలో ఉన్నారు.
రేవంత్ లాబీయింగ్….
ఈ ఇద్దరు ఎంపీలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి పట్నం గోస పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఢిల్లీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని రేవంత్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పార్టీ మారి వచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్య పదవి ఇవ్వడంపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన సమయంలో సీనియర్ నేతల నుంచి అభ్యంతరాలు ఎక్కువగా రావడం ఆయనకు మైనస్ పాయింట్ గా ఉంది.
కోమటిరెడ్డి దూకుడుతో….
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో సీనియర్. ఆయనకు కేపబులిటీ ఉంది. క్రౌడ్ పుల్లర్ గా పేరుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే ధైర్యం ఉంది. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో రెండేళ్లు పార్టీని రన్ చేయగలరని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గులాం నబీ ఆజాద్ వంటి నేతలతో లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఆయన దూకుడు స్వభావంతో పార్టీకి ఇబ్బంది అని కొందరు సీనియర్ నేతలు సూచిస్తున్నారు. మొత్తం మీద పీసీసీ చీఫ్ రేసులో మాత్రం ఈ ఇద్దరు ఎంపీల పేర్లు మాత్రం ఢిల్లీలో బాగా వినపడుతుండటం విశేషం.