హుజురాబాద్ లో టీఆర్ఎస్ కి గెలుపు ధీమా లేదా …?
చతురంగ బలగాలను హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రకటనకు ముందే కేసీఆర్ మోహరించేశారు. బ్రహ్మస్త్రం వంటి దళితబంధు ను విపక్షాలకు ఎక్కుపెట్టి బిజెపి, కాంగ్రెస్ ను డిఫెన్స్ లో [more]
చతురంగ బలగాలను హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రకటనకు ముందే కేసీఆర్ మోహరించేశారు. బ్రహ్మస్త్రం వంటి దళితబంధు ను విపక్షాలకు ఎక్కుపెట్టి బిజెపి, కాంగ్రెస్ ను డిఫెన్స్ లో [more]
చతురంగ బలగాలను హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రకటనకు ముందే కేసీఆర్ మోహరించేశారు. బ్రహ్మస్త్రం వంటి దళితబంధు ను విపక్షాలకు ఎక్కుపెట్టి బిజెపి, కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేశారు గులాబీ దళపతి. రాబోయే రోజుల్లో కులాల వారీగా వరాల జల్లు కురిపించి వివిధ వర్గాల ఓట్లను కొల్లగొట్టే పనిలో పడింది కారు పార్టీ. మరో పక్క వచ్చిన వారిని వచ్చినట్లు గులాబీ కండువా కప్పేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నాలుగు ఓట్లు తెచ్చే నేతకు సైతం అధికార పదవో పార్టీ పదవో ఇచ్చి వారిలో జోష్ నింపేస్తున్నారు కేసీఆర్. సామ దాన దండోపాయాలను ఈ ఎన్నికలకు ఉపయోగిస్తున్నా గులాబీ లో ఎదో మూల గెలుపుపై ధీమా లేదన్నది తేలిపోతుంది.
ఆయన వ్యాఖ్యలే నిదర్శనం …
హుజురాబాద్ ఉప ఎన్నికలా ? అవి గెలిస్తే ఎంత ఓడిపోతే ఎంత ఇది తమ పార్టీకి చాలా చిన్న విషయం గా వ్యాఖ్యలు చేసి సంచలనం రేకెత్తించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిన్న ఎన్నికలే అయితే వీధికో మంత్రి, ఎమ్యెల్యేలను సైతం ఎందుకు ఆ పార్టీ మోహరిస్తుంది ? వేలకోట్ల రూపాయలు దళితబంధు పథకం కేసీఆర్ ఎందుకు ప్రకటించారు ? రెండేళ్ళుగా క్షేత్ర స్థాయి కి రాని కెసిఆర్ ఇప్పుడు ఉద్యమ సమయంలో తిరిగినట్లు వీధిన ఎందుకు పడాలిసి వచ్చింది.
ఈ ప్రశ్నలకు…
ఇలాంటి అనేక ప్రశ్నలను రాజకీయ విశ్లేషకులు విపక్షాలు సంధిస్తున్నాయి. తమది రాజకీయ పార్టీ అని సన్నాసుల మఠం కాదని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా విజయం పై మాత్రం ఎక్కడో ఉన్న చిన్న అనుమానం నేపథ్యంలోనే ఆ ఎన్నికలు తమకు చిన్న విషయంగా ఇప్పటినుంచి ప్రచారం మొదలు పెట్టడం మాత్రం కారు పార్టీ క్రేజ్ ను మసకబార్చాయనే చెప్పాలి.