మూడింటితో మూడ్ ఛేంజ్ అయినట్లుందే?
వరస ఎన్నికలు తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఎన్నికలంటేనే సై అనే గులాబీ పార్టీ నేతలు ఇప్పుడు ఎన్నికలంటేనే నీరసపడిపోతున్నారు. దుబ్బాక ఉప [more]
వరస ఎన్నికలు తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఎన్నికలంటేనే సై అనే గులాబీ పార్టీ నేతలు ఇప్పుడు ఎన్నికలంటేనే నీరసపడిపోతున్నారు. దుబ్బాక ఉప [more]
వరస ఎన్నికలు తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఎన్నికలంటేనే సై అనే గులాబీ పార్టీ నేతలు ఇప్పుడు ఎన్నికలంటేనే నీరసపడిపోతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తక్కువ స్థానాలను సాధించడం వంటివి ఇందుకు కారణాలు. అయితే టీఆర్ఎస్ ను ఎన్నికలు వదలిపెట్టడం లేదు. త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పాటు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
సాగర్ ఉప ఎన్నికలో…..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపుపై కొంత ధీమా ఉన్నా అక్కడ బలమైన అభ్యర్థిగా జానారెడ్డి ఉండటంతో ఇప్పుడు టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో కసరత్తులు ప్రారంభించింది. అభ్యర్థి ఎంపికలో సయితం ఈసారి ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ అన్ని పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. జానారెడ్డిని ఢీకొట్టే వ్యూహాన్ని రచిస్తున్నారు.
సమావేశాల మీద సమావేశాలు….
ఇక వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసే అవకాశముంది. ఈ స్థానం నుంచి కోదండరామ్, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ వంటి వారు కూడా పోటీ చేస్తుండటంతో తమకు అనుకూల ఫలితం వస్తుందని టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ మూడు జిల్లాల నేతలతో ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఇక్కడ మాత్రం…?
ఇక మరో ఎమ్మెల్సీ ఎన్నికపైన కూడా టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా అభ్యర్థి ఎవరు అన్నది టీఆర్ఎస్ ఇంకా నిర్ణయించలేదు. ఇక్కడ ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలో ఉంటున్నారు. ప్రచారాన్ని కూడా ఆయన సోషల్ మీడియాలో ప్రారంభించారు. ఇక్కడ ఆయనకు టీఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద ఈ మూడు ఎన్నికలు టీఆర్ఎస్ నేతల మూడ్ ను ఛేంజ్ చేశాయనే చెప్పాలి.