టీడీపీ యువనేత… మూడు జిల్లాల రాజకీయం
రాజకీయాల్లో ఉన్నవారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనే కోరుకుంటారు. అదే సమయంలో కేడర్ కూడా దీనినే ఆశిస్తుంది. ఇక, పార్టీ బలపడాలన్నా.. తమకున్న నియోజకవర్గంలో నిత్యం సంచరించడం [more]
రాజకీయాల్లో ఉన్నవారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనే కోరుకుంటారు. అదే సమయంలో కేడర్ కూడా దీనినే ఆశిస్తుంది. ఇక, పార్టీ బలపడాలన్నా.. తమకున్న నియోజకవర్గంలో నిత్యం సంచరించడం [more]
రాజకీయాల్లో ఉన్నవారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనే కోరుకుంటారు. అదే సమయంలో కేడర్ కూడా దీనినే ఆశిస్తుంది. ఇక, పార్టీ బలపడాలన్నా.. తమకున్న నియోజకవర్గంలో నిత్యం సంచరించడం పార్టీని బలోపేతం చేయడం.. సమస్యలు తెలుసుకోవడం చేయాలన్నా.. కూడా నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఉండాలనేది కామన్ సూత్రం. అయితే ఇటీవల కాలంలో ఈ ఫార్ములాను చాలా మంది నాయకులు విస్మరిస్తున్నారనే వ్యాఖ్యలు దాదాపు అన్ని పార్టీల్లోనూ వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల్లో ఈ విమర్శలు మరింతగా జోరందుకుంటున్నాయి. ఇలాంటి టాకే.. ఇప్పుడు విజయనగరం టీడీపీలో వినిపిస్తోంది.
జూనియర్ కు ఇవ్వడంతో….
ఇటీవల టీడీపీలో కీలకమైన పార్టీ పదవుల పందేరం జరిగింది. పార్లమెంటరీ పదవులను చంద్రబాబు సీనియర్లకు ఇచ్చారు. ఆచి తూచి.. చంద్రబాబు నాయకులకు పదవులు కేటాయించారు. పార్లమెంటు పరిధిలో పార్టీని డెవలప్ చేయాలని..కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని.. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని కూడా ఆయన భావించారు. ఈ క్రమంలోనే జిల్లాల విభజనను దృష్టిలో పెట్టుకుని పదవులు ఇచ్చారు. ఇలా.. విజయనగరం పార్లమెంటు జిల్లాకు కిమిడి మృణాళిని కుమారుడు.. రాజకీయాల్లో జూనియర్ అయిన కిమిడి నాగార్జునకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
ఆయన ఎప్పుడు ఎక్కడ?
ఇలా.. అత్యంత కీలకమైన పదవిని అందిపుచ్చుకున్న నాగార్జున చెలరేగిపోతారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన వైఖరి నెమ్మదిగా తెలియడంతో కేడర్ డీలా పడుతున్నారు. కిమిడి ఫ్యామిలీ.. సొంత జిల్లా శ్రీకాకుళం. రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం. నాగార్జున మాతృమూర్తి, మాజీ మంత్రి కిమిడి మృణాళిని శ్రీకాకుళం జెడ్పీ చైర్ పర్సన్‌గా పనిచేశారు. ఇక, నాగార్జునకు రాజకీయంగా ఇంచార్జ్ పదవి దక్కిన జిల్లా విజయనగరం. పైగా ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం చీపురుపల్లి కూడా విజయనగరంలోనే ఉంది. కానీ, ఆయన మాత్రం ఉంటోంది విశాఖ. ఇలా మూడూ జిల్లాల్లో ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో అర్ధం కావడం లేదని అంటున్నారు టీడీపీ కేడర్.
పట్టుమని పది రోజులు కూడా….
విజయనగరం బాధ్యతలను చేపట్టిన నాగార్జున పట్టుమని పది రోజులు కూడా ఇక్కడ ఉండలేదని టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది. కొత్త అధ్యక్షుడు వచ్చాడు.. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఎవరైనా కలిసేందుకు కూడా నాగార్జున దొరకని పరిస్థితి. ఒకరోజు నియోజకవర్గానికి వస్తే.. వారం రోజులు రెస్ట్ తీసుకుంటున్నారని.. ఎక్కువ సమయంలో విశాఖలోనే బస చేస్తున్నారనేది వారి ప్రధాన విమర్శ. నాగార్జునకు చేయాలనే ఉత్సాహం ఉన్నా…. తాపత్రయం కూడా ఉన్నా.. పనిచేయడంలోనే అలసత్వం చూపుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.చీపురుపల్లి నియోజకవర్గాన్నే చక్కపెట్టలేని వ్యక్తికి విజయనగరం పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఎలా ? ఇచ్చారో తెలియడం లేదన్నదే తమ్ముళ్ల బాధ.మరి ఒక జిల్లాకు చెందిన నాయకుడిని మరో జిల్లాకు ఇంచార్జ్‌గా చంద్రబాబు ఎలా నియమించారో ? తమకు అర్ధం కావడం లేదని వారు తలపట్టుకుంటున్నారు.