టీడీపీకి ఈసారి ఆ ఛాన్స్ లేదా..?
2014 ఎన్నికల్లో ఘన విజయం సాదించి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోంది. గత ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా [more]
2014 ఎన్నికల్లో ఘన విజయం సాదించి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోంది. గత ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా [more]
2014 ఎన్నికల్లో ఘన విజయం సాదించి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోంది. గత ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా నరేంద్ర మోడీ వేవ్ చంద్రబాబుకు బాగా కలిసివచ్చింది. పవన్ కళ్యాణ్ పోటీ కూడా చేయకుండా మద్దతు ఇవ్వడం టీడీపీకి బాగా మేలు చేసింది. ప్రత్యేకంచి కొన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ మద్దతు టీడీపీకి కలిసొచ్చింది. దీంతో పలు జిల్లాల్లో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాలో టీడీపీ స్వీప్ ఇంచుమించు స్వీప్ చేసింది. అయితే, ఈసారి ఆ పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏ జిల్లాలోనూ ఈ ఎన్నికల్లో టీడీపీకి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశాలు కనిపించడం లేదు.
సీమలో టగ్ ఆఫ్ వార్
రాయలసీమలోని అనంతపురంలోని 14 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ ఏకంగా 12 నియోజకవర్గాల్లో గెలవగా వైసీపీ 2 మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. గత ఎన్నికలతో పోల్చుకుంటే వైసీపీ కొంత బలంగా తయారైంది. టీడీపీపై ఆధిపత్యం లేకున్నా గతానికి కంటే మాత్రం ఎక్కువ సీట్లు దక్కించుకోవచ్చు. ఇక, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో గత ఎన్నికల్లోనే వైసీపీ ఎక్కువ సీట్లు సాధించింది. ఈసారి కర్నూలులో టీడీపీ కొంత బలోపేతమైనా ఏకపక్షంగా మాత్రం రిజల్ట్ ఉండే అవకాశం లేదు. ప్రకాశం జిల్లాలో టీడీపీ కంటే వైసీపీనే బలంగా కనిపిస్తోంది. ఇక్కడా టీడీపీకి ఏకపక్షంగా ఫలితాలు ఉండకపోవచ్చు. నెల్లూరు జిల్లా అయితే వైసీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ బలోపేతం కావడానికి టీడీపీ ప్రయత్నం చేసినా అంత విజయవంతం కాలేదు.
కోస్తాంధ్రలో పెరిగిన వైసీపీ బలం…
ఇక, గత ఎన్నికల్లో టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గుంటూరు జిల్లాలో ఈసారి వైసీపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. కృష్ణా జిల్లాలోనూ గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీకి బలమైన అభ్యర్థులు దొరికారు. ఈ రెండు జిల్లాల్లో రాజధాని ప్రభావం వల్ల టీడీపీకి బాగా మేలు జరగే అవకాశం ఉంది. ముందు నుంచే ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. కాబట్టి కృష్ణ, గోదావరి జిల్లాల్లో మళ్లీ టీడీపీ మంచి ఫలితాలే సాధించవచ్చు కానీ ఏకపక్షంగా అయితే ఫలితాలు ఉండకపోవచ్చు. కృష్ణతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు టీడీపీకి బాగా కలిసొచ్చింది.
జనసేన పోటీతో…..
పవన్ ఇప్పుడు వేరు కావడంతో ఆయన ప్రభావం ఈ మూడు జిల్లాల్లోనూ ఉండనుంది. దీంతో ఇక్కడ కూడా గత ఎన్నికలలా టీడీపీ ఇక్కడ స్వీప్ చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. ఇక, విశాఖపట్నం జిల్లాలో రూరల్ లోని నియోజకవర్గాలు మినమా మిగతా అన్ని చోట్ల టీడీపీ గత ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. ఇక్కడ మోడీ వేవ్ టీడీపీకి ఉపయోగపడింది. ఈసారి బీజేపీ లేకపోవడం టీడీపీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక, వైసీపీ కూడా గతం కంటే పుంజుకుంది. జనసేన కూడా ఇక్కడ కొంత ప్రభావం చూపనుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ చేరికల వల్ల వైసీపీ గతం కంటే బలం పుంజుకుంది. మొత్తానికి గత ఎన్నికల్లోలా ఏ జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీకి ఏకపక్ష ఫలితాలు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశం లేదు.