ముగ్గురికీ ముప్పేనా
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేవం పార్టీ తరఫున గెలిచిన కీలక నాయకులు చిక్కుల్లో పడ్డారు. వాస్తవానికి చచ్చీచెడీ 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలను నిలబెట్టుకుంది టీడీపీ. [more]
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేవం పార్టీ తరఫున గెలిచిన కీలక నాయకులు చిక్కుల్లో పడ్డారు. వాస్తవానికి చచ్చీచెడీ 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలను నిలబెట్టుకుంది టీడీపీ. [more]
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేవం పార్టీ తరఫున గెలిచిన కీలక నాయకులు చిక్కుల్లో పడ్డారు. వాస్తవానికి చచ్చీచెడీ 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలను నిలబెట్టుకుంది టీడీపీ. ఫలితంగా ప్రతిపక్ష హోదాను సాధించింది. అయితే, ఇప్పుడు ముగ్గురు కీలక ఎమ్మెల్యేలపై ప్రత్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు వైసీపీకి చెందిన సీనియర్లు కోర్టు కెళ్లారు. విషయంలోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి పోటీ చేసిన విజయం సాధించారు మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. అయితే, ఈయనపై వైసీపీ తరఫున పోటీ చేసి, ఓడిపోయిన తోట వాణి కోర్టు కెక్కారు.
క్రిమినల్ కేసులను….
ఎన్నికల సంఘానికి చినరాజప్ప సమర్పించిన అఫిడవిట్లో తనపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించకుండా నిబంధనలను పాటించలేదని, కాబట్టి చినరాజప్ప గెలుపును సస్సెండ్ చేయాలని వాణి కోర్టును అభ్యర్థించారు. ఓఎంసీ సంస్థపై దాడి చేసి అక్కడ ఆస్తులు ధ్వంసం చేసిన తెలుగుదేశం నేతల్లో చిన్నరాజప్ప ఒకరని, అందుకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయని.. ఆ కేసుల వివరాలను చిన్నరాజప్ప అఫిడవిట్ లో పేర్కొనలేదని తోటవాణి ఆరోపించారు. ఈ మేరకు కోర్టుకు ఎక్కారు. ప్రస్తుతం ఇది విచారణ దశలో ఉంది. మరోపక్క, చీరాలలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది.
నలుగురు సంతానం….
ప్రకాశం జిల్లా చీరాల నుంచి గెలిచిన తెలుగుదేశం సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ కోర్టును ఆశ్రయించారు. బలరామ కృష్ణమూర్తి కి నలుగురు సంతానం ఉన్నారని, ఈ విషయాన్ని అఫిడవిట్లో పొందు పరచలేదని, ముగ్గురు సంతానమే అని కరణం పేర్కొన్నారని, కాబట్టి ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆయన కోర్టు ను ఆశ్రయించారు. మరోపక్క, ఇప్పుడు .. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన వైసీపీ నాయకుడు పేరాడ తిలక్ కోర్టుకు ఎక్కారు.
అఫడవిట్ లో పేర్కొనలేదని….
టెక్కలి శాసనసభ్యుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదంటూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అచ్చె న్నాయుడు తనపై ఉన్న కేసులను ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చాల్సి ఉన్నప్పటికీ కొన్ని క్రిమినల్ కేసుల వివరా లను దాచిపెట్టి ఎన్నికల కమిషన్కు తప్పుదోవ పట్టించారని పేర్కొన్నా రు. 2007జూలై 21న ఓబులాపురం మైనింగ్ వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారన్న అభియోగంపై అచ్చెన్నతో పాటు మరో 20 మందిపై అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. మారణాయుధాలతో అప్పటి ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ ఆఫీసులో ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ విషయాలను అఫిడవిట్లో ఎక్కడా పేర్కొనలేదని, కాబట్టి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అచ్చెన్న ఎన్నిక చెల్లదని ఆయన కోర్టుకు తెలిపారు. మరి ఏమవుతుందో చూడాలి.