కరోనా… నారా కు కలసి వచ్చింది
కరోనా సమయంలోనూ తెలుగుదేశం పార్టీ సలహాలు, సూచనలకన్నా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం కరోనాను నియంత్రించలేకపోతుందన్న విమర్శలు ఎటూ ఉండనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం [more]
కరోనా సమయంలోనూ తెలుగుదేశం పార్టీ సలహాలు, సూచనలకన్నా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం కరోనాను నియంత్రించలేకపోతుందన్న విమర్శలు ఎటూ ఉండనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం [more]
కరోనా సమయంలోనూ తెలుగుదేశం పార్టీ సలహాలు, సూచనలకన్నా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం కరోనాను నియంత్రించలేకపోతుందన్న విమర్శలు ఎటూ ఉండనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నిత్యం టీడీపీ నేతలతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు.
నిధులపై లెక్కలు చెప్పాలంటూ….
ఏపీ ప్రభుత్వం వద్ద నిధులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయన్నది టీడీపీ వాదన. ఆ నిధులను కరోనా సమయంలో పేదల కోసం ఉపయోగించడం లేదని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులను విడుదల చేసిందని, ఈ నిధులకు లెక్కలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ కోరుతోంది. అంతేకాకుండా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు పార్టీ నేతలకు హైదరాబాద్ నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇళ్లల్లోనే దీక్షలు….
దీంతో అనేక మంది టీడీపీ నేతలు తమ ఇళ్లల్లోనే దీక్షలకు దిగుతున్నారు. స్థానిక సమస్యలతో పాటు పేదలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఒకరోజు దీక్షను కొనసాగించారు. విడతల వారీగా టీడీపీ నేతలు దీక్షకు దిగుతున్నారు. మీడియాలో పెద్దగా వీటికి ప్రచారం లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా తమ దీక్షల సంగతి ప్రజలకు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్ నుంచే…?
మరోవైపు టెస్టింగ్ ల సంఖ్యను కూడా పెంచాలని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. కొన్ని చోట్ల కేసులను దాస్తున్నారని కూడా ఆరోపిస్తుంది. విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో అతి తక్కువ కేసులను చూపడంలో ఆంత్యమేంటని టీడీపీ ప్రశ్నిస్తుంది. మొత్తంగా చూస్తే కరోనా సమయంలో టీడీపీ యాక్టివ్ అయిందనే చెప్పాలి. కరోనాకు ముందు కన్పించని టీడీపీ నేతలు సయితం ఇప్పడు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునకు స్పందిస్తున్నారు. ఒక రకంగా కరోనా టీడీపీ అధినేతకు పార్టీని బలోపేతం చేసేందుకు సాయపడిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది.