అందరికోసం ఈ ప్రభుత్వం
లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. నవభారతా వని కోసం ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజలు మోదీ [more]
లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. నవభారతా వని కోసం ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజలు మోదీ [more]
లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. నవభారతా వని కోసం ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వానికి మద్దతిచ్చారన్నారు. తొలి మహిళ ఆర్థికమంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంస్కరణలు, పనిచేయడం ద్వారా దేశంలో కొత్త ఒరవడిని సృష్టించామన్నారు. దేశంలోని ప్రతి మూలా, ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను చేర్చడమే లక్ష్యంగా పనిచేశామన్నారు. బలమైన సంకల్పం ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. జాతీయ భద్రత, ఆర్థిక ప్రగతే తమ లక్ష్యమని నిర్మల వివరించారు. శక్తి వంతమైన దేశం కావాలంటే శక్తిమంతమైన పౌరులుండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
నవ భారత నిర్మాణానికి….
నవీన భారత నిర్మాణానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. లక్ష్యాలను సాధిస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని చెప్పారు. అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడమే ఉద్దేశ్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమికి చేరనుందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆరో ఆర్థిక వ్యవస్థ మనదని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాను పారిశ్రామికవేత్తలు అర్థం చేసుకున్నారన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సహాకాలిచ్చామన్నారు. ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మౌలిక వసతుల కసం భారగీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
సామాన్యుడి జీవితంలో మార్పు….
ముద్ర పథకం సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందని నిర్మల చెప్పారు. మధ్య, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు. రవాణారంగాన్ని పారిశ్రామిక రంగంతో అనుసంధానం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. చైనా, అమెరికా తర్వాత బలమైన ఆర్థిక వ్యవస్థ మనదన్నారు. సరకు రవాణా కోసం నదీమార్గాలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గంగా నదిలో ఇప్పటికే సరకు రవాణా ప్రారంభించామన్నారు. రైల్వే ప్రాజెక్టులను త్వరిగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వ – ప్రయివేటు భాగస్వామ్య పద్ధతిని అనుసరిస్తామని చెప్పారు. అద్దెకుండే వారి హక్కుల కోసం సరికొత్త విధానాన్ని తేనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆహార భద్రతకు వ్యయం రెట్టింపు చేశామన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఫైనాన్సింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. దేశంలో ప్రస్తుతం 657 కి.మీ మెట్రోరైలు లైన్ల నిర్మాణం జరిగిందన్నారు. సాహిబ్ గంజ్, హల్దియాలో సరకు రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వన్ నేషన్… వన్ గ్రిడ్….
దేశంలో అందరికీ విద్యుత్ ను అందించేందుకు వన్ నేషన్ వన్ గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. చిన్న నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. రైల్వేకు ఏటా లక్షన్నర కోట్ల నిధులు అవసరమవుతుందన్నారు. రైల్వేలో ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు. ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్లలో ప్రత్యేక విధానాన్ని తెచ్చామని నిర్మల తెలిపారు. రూపే కార్డుతో బహుళ సేవలు చేసే అవకాశముందన్నారు. అందరికీ ఇల్లు అందించడంపై దృష్టి పెడుతున్నామన్నారు. ప్రధానమంత్రి కర్మయోగి మాన్ ధన్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఉడాన్ పథకం ద్వారా చిన్న చిన్న పట్టణాలకు విమానసౌకర్యం కల్పిస్తామన్నారు. జీఎస్టీ కోసం నమోదు చేసుకున్న వారికి రెండు శాతం రాయితీ కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. గాంధీ 150 జయంతి సందర్భంగా అంత్యోదయ పథకాన్ని ప్రారంభించామన్నారు.