ఈ రోజు ఇక.. చరిత్రలో
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. వాస్తవానికి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో [more]
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. వాస్తవానికి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో [more]
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. వాస్తవానికి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో అందరి హృదయాల్లోనూ చెక్కుచెదరని స్థానాన్ని సంపాయించుకున్నారు వైఎస్. ఆరోగ్య శ్రీ కావొచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావొచ్చు… ప్రజలకు మేలు చేసే అనేక పథకాలతో వైఎస్ తన పాలనా కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వాసనలు నేటికీ మనకు కనిపిస్తున్నాయి. నేను ఉన్నాను.. నేను ఉన్నాను.. అంటూ పేదల సమస్యలపై స్పందించిన తీరు వైఎస్‌ను తెలుగు చరిత్రలో సమున్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. తాజాగా ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్ ఏపీలో పాలన సాగిస్తున్నారు.
గుర్తుండి పోయేలా….
ఈ క్రమంలో వైఎస్ పేరు ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా ఉండిపోయేలా ఆయన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 8వ తేదీన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని 'వైఎస్సార్ రైతు దినోత్సవం' ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్థాయి రైతు దినోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు అత్యంత వైభవంగా జరగనుంది.
రైతుల్లో భరోసా…..
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొని రైతుల్లో భరోసాను నింపనున్నారు. రైతు దినోత్సవం రోజే 'రైతులకు ఉచిత పంట బీమా పథకాన్ని' సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. రాష్టంలోని రైతులకు బీమా పత్రాలను అందజేస్తారు. రైతలు ప్రమాదవశత్తు మరణించినా, కాలం కలిసిరాక ఆత్మహత్యకు పాల్పడినా రైతులకు బీమ సొమ్ము రూ. 7 లక్షలు అందజేస్తారన్నారు. రైతు దినోత్సవం రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమంగా ఏపీ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించనుంది.
పరిశోధనా కేంద్రానికి…..
అదే రోజు పులివెందులలో అరటి పరిశోధన కేంద్రానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రైతుల నుంచి వినతులు స్వీకరించడం, వివిధ కేటగిరీల్లో ఉత్తమ రైతుల ఎంపిక సన్మాన కార్యక్రమం ఉంటుంది. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తానికి వైఎస్ జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ద్వారా… ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన రాజన్న రాజ్య స్థాపనకు నాంది పలికినట్టు అయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.