ఆ దెబ్బకు అందరూ ఒక్కటయ్యారా? బాబు ఇచ్చిన షాక్ తోనేనా?
ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కంటికి కనిపించని శత్రువు కరోనా ఇప్పుడు ఏపీ టీడీపీలో చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఉన్న, ఎవరిదారి వారిదే అని భావించిన నాయకులను ఏకతాటిపైకి తెచ్చిందా [more]
ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కంటికి కనిపించని శత్రువు కరోనా ఇప్పుడు ఏపీ టీడీపీలో చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఉన్న, ఎవరిదారి వారిదే అని భావించిన నాయకులను ఏకతాటిపైకి తెచ్చిందా [more]
ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కంటికి కనిపించని శత్రువు కరోనా ఇప్పుడు ఏపీ టీడీపీలో చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఉన్న, ఎవరిదారి వారిదే అని భావించిన నాయకులను ఏకతాటిపైకి తెచ్చిందా ? పార్టీలో నేతల మధ్య ఐకమత్య రాగం పాడేలా చేసిందా ? అంటే.. తాజా పరిణామాలు, పరిస్థితులను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు ఇప్పుడు ఒకే తాటిపైకి వస్తున్నారు. వారు కలసి కట్టుగా పార్టీ వ్యూహాలను ముందుకు తీసుకు వెళ్తున్నారు. దీంతో కరోనా ఎఫెక్ట్ పార్టీపైనా నేతలపైనా ప్రభావం చూపిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.
ఎవరికి వారు దూరంగా….
విశాఖ జిల్లాలోని విశాఖపట్నం నగరంలో ఉన్న నాలుగు నియోజకవర్గాలను కూడా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది. అయితే, పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నాయకులు గెలిచిన తర్వాత కూడా ఎవరికి వారుగా దూరంగా ఉండిపోయారు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గట్టి పట్టు సాధించింది కూడా విశాఖలోనే. అయినా నేతల మధ్య సఖ్యత లోపించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్థానిక ఎన్నికల సమయంలోనూ ఎవరికి వారుగా నాయకులు వ్యవహరించారు. పైగా టీడీపీలో నేతల మధ్య కూడా అంతర్గత విభేదాలు, వివాదాలు ఉన్నాయి. దీంతో పార్టీ పూర్తిస్థాయిలో ఇక్కడ ప్రభావం చూపించలేక పోయింది. ఇక ఇలా ఉన్న నాయకులు ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఒక్కటిగా తమ గళం వినిపిస్తున్నారు.
బాబు వార్నింగ్ లతో….
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు, వార్నింగులతో రంగంలోకి దిగిన మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. తన మౌనాన్ని వీడి.. కరోనాపై ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు. బియ్యం ఇవ్వండి, వలస కూలీలను ఆదుకోండి, పింఛన్లు పెంచండి ఇలా అనేక సూచనలతో లేఖలు రాస్తున్నారు. ఇక, మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏకంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తు్న్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.
కొంత కోలుకుందా?
అదేవిధంగా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్, గణబాబు ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆళ్లనానిలు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ దూకుడు పెంచడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మొత్తానికి పార్టీ కొంతమేరకు కోలుకుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.