సాధ్యం కాదని తెలిసినా ఇదేం గోల?
పార్లమెంటులో ప్రత్యేక హోదా నినాదాన్ని వైసీపీ వినిపిస్తూనే ఉంది. అది సాధ్యం కాదని తెలుసు. అయినా రాజకీయ ప్రయోజనం కోసం ప్రత్యేక హోదా నినాదాన్ని మరోసారి వైసీపీ [more]
పార్లమెంటులో ప్రత్యేక హోదా నినాదాన్ని వైసీపీ వినిపిస్తూనే ఉంది. అది సాధ్యం కాదని తెలుసు. అయినా రాజకీయ ప్రయోజనం కోసం ప్రత్యేక హోదా నినాదాన్ని మరోసారి వైసీపీ [more]
పార్లమెంటులో ప్రత్యేక హోదా నినాదాన్ని వైసీపీ వినిపిస్తూనే ఉంది. అది సాధ్యం కాదని తెలుసు. అయినా రాజకీయ ప్రయోజనం కోసం ప్రత్యేక హోదా నినాదాన్ని మరోసారి వైసీపీ భుజానకెత్తుకుంది. ఉభయ సభల్లోనూ వైసీపీ చేసిన రచ్చ ప్రజలను ఆకట్టుకోవడానికే తప్ప మరేరకమైన ప్రయోజనం లేదు. ప్రత్యేక హోదా సాధించాలంటే రాజీనామాలతోనైనా కేంద్ర ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకోవాలి. అంతే తప్ప పార్లమెంటులో నినాదాలు చేస్తే వస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుంది.
ఆయన ఒప్పుకున్నా….
తాము ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం 2017లోనే స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ చేసిన ఈ ప్రతిపాదనకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం అంగీకరించారు. దీంతో ప్రత్యేక హోదా అనేది ఇక మరిచిపోయినట్లే అనుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఇతర రాష్ట్రాలు కూడా తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టాయి.
పక్కన పెట్టినా….
బీహార్ వంటి రాష్ట్రం సయితం తమకు ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. ఇతర రాష్ట్రాల నుంచి వత్తిడి వచ్చే అవకాశముండటంతో ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఆనాడే స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నప్పటికీ దానికి తూట్లు పొడిచి దానిని అటకెక్కించింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా ఏపీకి రావడమనేది కల్ల.
అయినా సరే….
అయినా వైసీపీ, తెలుగుదేశం పార్టీలు మాత్రం ప్రత్యేక హోదాను పట్టుకునే వేలాడుతున్నాయి. కేవలం ఆ పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి తప్పించి మరో కారణం లేదు. పార్లమెంటులో సభలను స్థంభింప చేసినా ఫలితం లేదని తెలిసి రెండు పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్య పెడుతున్నాయి. ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పాలి. అయితే మైలేజీ కోసం చేస్తున్న ఈ పోరాటం లో ప్రజలు ఎవరు చిత్తశుద్ధిని నమ్ముతారన్నది వచ్చే ఎన్నికలలో తేలనుంది.