టీడీపీలో కొత్త గొడవలు.. అక్కడ అంతేనట
తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలలో నాయకత్వ సమస్య ఉంటే మరికొన్ని చోట్ల వర్గ పోరు ఉంది. విశాఖ జిల్లాలో టీడీపీ రాజకీయ ముఖ చిత్రం ఇది. టీడీపీకి [more]
తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలలో నాయకత్వ సమస్య ఉంటే మరికొన్ని చోట్ల వర్గ పోరు ఉంది. విశాఖ జిల్లాలో టీడీపీ రాజకీయ ముఖ చిత్రం ఇది. టీడీపీకి [more]
తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలలో నాయకత్వ సమస్య ఉంటే మరికొన్ని చోట్ల వర్గ పోరు ఉంది. విశాఖ జిల్లాలో టీడీపీ రాజకీయ ముఖ చిత్రం ఇది. టీడీపీకి విశాఖ ఉత్తరం, దక్షిణం, భీమిలీ, చోడవరం, ఎలమంచిలి, మాడుగుల వంటి చోట్ల లీడ్ చేసే నాయకులు కనిపించడంలేదు. అదే సమయంలో కొన్ని చోట్ల మాత్రం బహు నాయకత్వం పార్టీకి చికాకు తెప్పిస్తోంది. అలాంటి వాటిలో గాజువాక, పెందుర్తి, పాయకరావుపేట, అనకాపల్లి ఉన్నాయి. ఇక్కడ పాతవారిని కాదని తమకు టికెట్లు ఇవ్వాలని నాయకులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే రూరల్ జిల్లా ముఖద్వారంగా ఉన్న అనకాపల్లిలో టీడీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువ అయిపోయారు.
మాజీ అయ్యాక పేచీ ….
అనకాపల్లిలో సీనియర్ మోస్ట్ నేతగా బుద్దా నాగజగదీశ్వరరావు ఉన్నారు. నిజానికి ఆయనకే 2014లో టికెట్ ఇవ్వాలి. కానీ పెందుర్తికి చెందిన పీలా గోవింద సత్యనారాయణకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఈయన ఒక మాజీ మంత్రి పలుకుబడితో టికెట్ తెచ్చుకున్నారు. పైగా అంగబలం, అర్ధబలం గట్టిగా ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. దాంతో టీడీపీని నమ్ముకున్న జగదీశ్వరావుని బాబు నచ్చచెప్పి పక్కన పెట్టారు. 2019లో టికెట్ ఇస్తామని నాడు చెప్పినా మరోసారి పీలాకే బాబు టికెట్ ఇచ్చారు. అప్పటికి వైసీపీ దూకుడుగా ఉండడంతో పీలా అయితేనే ధీటుగా ఎదుర్కొంటాడని భావించి బాబు అలా చేశారు. ఇలా 2019లో కూడా అన్యాయం జరిగింది.
రెండేళ్ళ ముచ్చట….
నాగజగదీశ్వరరావుని 2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా బాబు పంపించారు. రెండేళ్ళ కాలానికి మాత్రమే మిగిలి ఉన్న ఆ పదవి కాస్తా తాజాగా అయిపోయింది. దీంతో మాజీ అయిన బుద్ధా వచ్చే ఎన్నికల కోసం ఎమ్మెల్యే టికెట్ కి పోటీ పడనున్నారు. తాను చంద్రబాబు మాట విని రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశానని, ఈసారి బాబు తప్పకుండా తనకే టికెట్ ఇచ్చి ఆదరిస్తారని బుద్దా నమ్మకంగా ఉన్నారు. దానికి తోడు ఆయన ఇప్పటి నుంచే దూకుడు చేస్తున్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో బలంగా టీడీపీ వాయిస్ వినిపించి హై కమాండ్ మన్ననలు అందుకున్నానని కూడా ఆయన చెబుతున్నారు.
పక్కా లోకల్ ….
ఇక్కడో విషయం ఉంది. నాగజగదీశ్వరరావు అనకాపల్లికి చెందిన వారు. ఆయన పక్కా లోకల్. దాంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఈసారి ఊరుకోమని కూడా గట్టిగా చెబుతున్నారు. అవసరం అయితే పీలాకు పెందుర్తిలో టికెట్ ఇవ్వమని కూడా కోరుతున్నారు. పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. పైగా మరో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా ఆశపెట్టుకున్నారు. దాంతో అక్కడ పీలాకు హుళక్కేనని అంటున్నారు. దాంతో పీలా తనకు కూడా అనకాపల్లి టికెట్ కావాలని పట్టుపడుతున్నారు. ఇద్దరి మధ్యన టీడీపీ రెండుగా చీలిపోయింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీకి ఈ కొత్త గొడవలు అవసరమా అని సీనియర్లు అంటున్నారు. మొత్తానికి ఈ లొల్లి ఎలా తీర్చాలో అధినాయకత్వమే ఆలోచించాల్సి ఉంది.