ఎంత కష్టపడ్డా మైలేజ్ లేదు… ప్చ్.. టీడీపీలో నైరాశ్యం…?
“రాజధాని మార్పుపై పోరాటం చేశాం. కానీ, ఏమీ సాధించలేక పోయాం. అన్న క్యాంటీన్ల రద్దుపై ఉద్యమాలు చేశాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మేం ఏం చేసినా.. [more]
“రాజధాని మార్పుపై పోరాటం చేశాం. కానీ, ఏమీ సాధించలేక పోయాం. అన్న క్యాంటీన్ల రద్దుపై ఉద్యమాలు చేశాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మేం ఏం చేసినా.. [more]
“రాజధాని మార్పుపై పోరాటం చేశాం. కానీ, ఏమీ సాధించలేక పోయాం. అన్న క్యాంటీన్ల రద్దుపై ఉద్యమాలు చేశాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మేం ఏం చేసినా.. కేవలం పత్రికలకు, మీడియాకే పరిమితం అవుతోంది తప్ప.. ప్రభుత్వాన్ని కదిలించలేక పోతున్నాం.“
ఆయన ఒక్కరే…?
“కరోనా కారణంగా.. అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు కానీ.. మేం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. అనేక మంది నేతలను కోల్పోయాం. పార్టీ చాలా చిక్కుల్లో ఉంది“ “చంద్రబాబు ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన ఒక్కరే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఇంతే. మరి ముందు ముందు మా పార్టీ పరిస్థితి ఏంటో మాకే అర్ధం కావడం లేదు“- ఇదీ టీడీపీ నేతలు ఒకరితో ఒకరు చెప్పుకొంటున్న మాటలు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని వారు కన్ఫర్మ్ చేస్తున్నారు.
సీనియర్లకే అవకాశం…..
జూనియర్లకు అవకాశం ఇవ్వకపోవడాన్ని కొందరుతప్పు పడుతుండగా.. జిల్లాల్లో నేతల మార్పు విషయంలో చంద్రబాబు.. స్పాట్ డెసిషన్ తీసుకోలేక పోతున్నారని.. దీంతో నాయకత్వ లోపం ఏర్పడిందని కొందరు అంటున్నారు. చాలా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం జూనియర్లు చెప్పిన మాటలు ఒక్కటంటే ఒక్కటి కూడా వినడం లేదట. సుధీర్ఘమైన జూమ్ మీటింగ్లు పెడుతూ ఎవరు ఏం సలహాలు చెప్పినా వినకుండా.. కేవలం సీనియర్లకు మాత్రమే టైం ఇస్తూ.. వారు పాడిన పాటకే బాగా ఊదుతూ అదే పంథాలో ముందుకు వెళుతున్నారని పార్టీలో పలువురు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు దృష్టిలో పార్టీ అంటే సీనియర్లు… సీనియర్లు అంటేనే పార్టీ అన్న అభిప్రాయం బలంగా నాటుకు పోయిందట. ఆయన ఈ తీరు మారకపోతే, యువనేతల మాటకు విలువ లేకపోతే ఆయనకు, యువ నేతలకు మధ్య మరింత గ్యాప్ వచ్చే ప్రమాదం ఉందని పార్టీలో యాక్టివ్గా ఉంటోన్న వారే చెపుతున్నారు.
రెండేళ్లవుతున్నా…?
తాము అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. గడిచిన రెండేళ్లలోనే టీడీపీ పుంజుకునేదని.. కానీ.. ఇప్పటి వరకు ఆ సూచనలు కనిపించడం లేదని.. కరోనా కారణంగా ప్రజల్లోకి రాలేక పోవడం ప్రధాన కారణం అయితే.. ఇతర కారణాలు కూడా ఉన్నాయని దీంతో టీడీపీ నేతలు ఇల్లు దాటి బయటకు రాలేక పోతున్నారని అంటున్నారు. ఇక తాజాగా పార్లమెంటరీ కమిటీల నియామకం జరిగింది. వీటిని కూడా వృద్ధ నేతలతోనే నింపేశారు. మొత్తంగా చూస్తే.. అటు అధిష్టానం స్థాయిలో కానీ.. ఇటు క్షేత్రస్థాయిలో కానీ..అనుకున్నది జరగడం లేదని నేతలువాపోతున్నారు. మరి టీడీపీ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలని అంటున్నారు ఆ పార్టీ అభిమానులు.