ఇలాగయితే ఈసారి కూడా కష్టమే
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. మరోవైపు వైసీపీ బలంగా ఉంది. ఈ సమయంలో సమన్వయంతో పనిచేసుకోవాల్సిన నేతలు వీధికెక్కుతున్నారు. అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు గ్రూపు [more]
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. మరోవైపు వైసీపీ బలంగా ఉంది. ఈ సమయంలో సమన్వయంతో పనిచేసుకోవాల్సిన నేతలు వీధికెక్కుతున్నారు. అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు గ్రూపు [more]
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. మరోవైపు వైసీపీ బలంగా ఉంది. ఈ సమయంలో సమన్వయంతో పనిచేసుకోవాల్సిన నేతలు వీధికెక్కుతున్నారు. అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు గ్రూపు తగాదాలతో పార్టీని రచ్చకెక్కిస్తున్నారు. ఇది భవిష్యత్ లో పార్టీకి మరింత చేటు తెస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సయితం అనేక సార్లు జోక్యం చేసుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడం విశేషం.
ప్రభుత్వ వ్యతిరేకతను…
అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండే స్థానాలు వచ్చాయి. హిందూపురం, ఉరవకొండలో తప్ప మిగిలిన అన్ని చోట్ల సైకిల్ పార్టీ చాపచుట్టేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునే పనిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉండాలి. కానీ వారు మళ్లీ ఆధిపత్యం కోసమే ప్రయత్నిస్తుండటంతో పార్టీ పరువు వీధిన పడుతుంది. వచ్చే ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేయాల్సిన నేతలు మరింత నిరాశలోకి నెట్టేస్తున్నారు.
ఒకరంటే ఒకరికి….
ఉదాహరణకు కల్యాణదుర్గం నియోజకవర్గం తీసుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేపై చాలా వ్యతిరేకత ఉంది. సరైన దిశలో ప్రయత్నిస్తే ఈసారి ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవడం తెలుగుదేశం పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత టీడీపీ ఇన్ ఛార్జి ఉమామహేశ్వరనాయుడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండు వర్గాలు పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీకి దిగుతున్నాయి.
ముందుగానే క్లారిటీ ఇస్తే…?
చంద్రబాబు అనేక సార్లు వీరి మధ్య ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. చివరకు ఇద్దరిలో ఒక్కరికే టిక్కెట్ వస్తుందన్నది వాస్తవం. ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి లేదు. దీంతో టిక్కెట్ దక్కని వారు ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి మరోసారి ఈ నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పవు. అందుకే చంద్రబాబు నాన్చకుండా ఇలాంటి నియోజకవర్గాల్లో ముందుగానే ఒక క్లారిటీ ఇస్తే పార్టీకి భవిష్యత్ ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.