Tdp : భరోసా లేదు… భరించే శక్తి మాకు లేదు
ఏమిరా నీవల్ల “దేశానికి” ప్రయోజనం బాలరాజూ అన్న సినిమా డైలాగు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థిితికి అద్దం పడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడమే దీనికి [more]
ఏమిరా నీవల్ల “దేశానికి” ప్రయోజనం బాలరాజూ అన్న సినిమా డైలాగు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థిితికి అద్దం పడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడమే దీనికి [more]
ఏమిరా నీవల్ల “దేశానికి” ప్రయోజనం బాలరాజూ అన్న సినిమా డైలాగు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థిితికి అద్దం పడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడమే దీనికి కారణం. గతంలో మాదిరి చంద్రబాబు లో స్థిరత్వం లేదు. సహనం కోల్పోతున్నారు. సంయమనంతో వ్యవహరించడం లేదు. తన ఓటమిని కూడా ప్రజలపై రుద్దు తున్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఆ నాయకత్వం ఉంటుంది. చంద్రబాబు నాయకత్వంలో అయితే కొద్దోగొప్పో గెలుస్తామన్న భరోసా ఉంటుంది.
వచ్చే ఎన్నికల్లోనూ….
వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కకపోతే తమ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు టీడీపీలో ఎక్కువ మంది నేతల ఆలోచన. అందుకే ఎగిరెగిరి పడటటం లేదు. అవతల ఉన్నది జగన్. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేశారు. ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. గత ఎన్నికల్లో చేసిన అప్పులు ఇంతవరకూ తీరలేదు. మొన్న చంద్రబాబు చేసిన దీక్షకు కూడా వాహనాల్లో కార్యకర్తలను తరలించాలంటే శక్తికి మించి భారమయింది. ఈ నేపథ్యంలో లోకేష్ ను నమ్ముకుని రాజకీయం చేయడం అనవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
టిక్కెట్ దక్కకున్నా లేకున్నా….
అనేక చోట్ల నేతలు తమకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ వచ్చినా రాకపోయినా ఒక్కటే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. వారంతా తాము టిక్కెట్ ఇవ్వమని అడిగేది లేదంటున్నారు. ఒకవేళ పిలిచి టిక్కెట్ ఇస్తే పార్టీయే సగం ఖర్చు భరించేలా ఒప్పించాలని సిద్ధమయ్యారు. టిక్కెట్ల కోసం పట్టుబట్టి మరీ తెచ్చుకుంటే మొత్తం ఖర్చును తామే భరించాల్సి వస్తుందని ఈ నిర్ణయానికి వచ్చారు.
బాబు తర్వాత?
చంద్రబాబు ఇక ఎంతోకాలం రాజకీయం చేయలేరు. జగన్ వయసులో ఉన్నారు. అలాగని నారా లోకేష్ ను నమ్ముకుని రాజకీయాలు చేస్తే పుట్టి మునుగుతుందని అనేక మంది నేతలు భావిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఒక యాభై మంది నేతలు మాత్రమే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన చోట్ల అసలు నాయకులు బయటకు రావడం లేదు. దీంతో చంద్రబాబు నాయకత్వం పై నమ్మకం ఉన్నా, పార్టీ భవిష్యత్ ను బేరీజు వేసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పుడు నేతల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుది కాదు. చినబాబుదే.