వారు పుంజుకోరు.. ఎదగనివ్వరు.. టీడీపీలో గుసగుస
అవును..! టీడీపీలో ఇప్పుడు అదే బాగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా రాష్ట్రంలో వ్యూహాత్మకంగా పుంజుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న పదవులను చంద్రబాబు [more]
అవును..! టీడీపీలో ఇప్పుడు అదే బాగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా రాష్ట్రంలో వ్యూహాత్మకంగా పుంజుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న పదవులను చంద్రబాబు [more]
అవును..! టీడీపీలో ఇప్పుడు అదే బాగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా రాష్ట్రంలో వ్యూహాత్మకంగా పుంజుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న పదవులను చంద్రబాబు ఇప్పటికే భర్తీ చేశారు. పార్లమెంటరీ పార్టీ పదవులతో పార్టీ రాష్ట్ర పార్టీ పదవులు కూడా భర్తీ అయ్యాయి. ఇంత వరకు బాగానేఉంది. అయితే.. పదవులు దక్కిన వారిలో చాలా మంది ఔట్ డేటెడ్ అయిపోయారు. కొందరు జూనియర్లు కూడా ఉన్నారు. ఇక పదవులు రాని వారిలో మెజార్టీ సభ్యులు పార్టీకి ఏరకంగానూ పనికి వచ్చే నాయకులు కారు. దీంతో చంద్రబాబు వారిని పక్కన పెట్టారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి…..
మరి ఇలా పక్కన పెట్టిన వారు ఏం చేయాలి ? ఏ విధంగా ముందుకు సాగాలి ? అంటే.. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పార్టీకి ఉపయోగ పడేవిధంగా అయినా వారిలో మార్పు రావాలి. టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేస్తే.. తమకు పేరు వస్తుంది? అనే కోణంలో వారు ఆలోచించి అడుగులు వేయాలి. లేదా.. వారి దారి వారు చూసుకోవాలి. తమకు నచ్చిన విధంగా దూరంగా ఉండాలి. అయితే.. ఈ రెండు మార్గాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు నాయకులు. వీరిలో ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు టీడీపీ సీనియర్లు.
క్యాడర్ ను దూరం చేసే…..
పార్టీ మారి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం అనుభవించిన ఆ నాయకులకు ఇప్పుడు టీడీపీలో కొన్ని అసమ్మతి రాగాలు తోడయ్యాయట. వైసీపీ నుంచి వచ్చిన వారిలో దాదాపు ఎవరికీ.. చంద్రబాబు పార్టీ పదవుల్లో ఛాన్స్ ఇవ్వలేదు. అంటే..వారు తమ దారి తాము చూసుకో వచ్చని పరోక్షంగా చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. అయితే.. దీనికి విరుద్ధంగా వీరు పార్టీని మరింత రోడ్డున పడేసేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. పార్టీ తాలూకు కార్యక్రమాల వివరాలను బయటకు పొక్కేలా చేస్తున్నారని.. పార్టీలో కేడర్‌ను పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
పార్టీని రోడ్డు మీద…..
ఇక, టీడీపీలోని సీనియర్ల కుమారులు చాలా మందికి కూడా చంద్రబాబు పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వలేదు. వారికి అనుభవం లేక కావొచ్చు. మరేదైనా కారణాలు ఉండి ఉండవచ్చు. అయితే తమకు అవకాశం ఇవ్వలేదు. కనుక తామేం చేసినా ఎవరు మాత్రం అడ్డుకుంటారులే అనుకుంటున్న నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ పరువు రోడ్డున పడుతోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా టీడీపీలో వీరి రగడ అంతా ఇంతా కాదు. వీరు ఎదగడం లేదు.. పార్టీకి ఉపయోగపడడం లేదు సరికదా.. పార్టీని నాశనం చేసేలా ప్రవర్తిస్తున్నారు. బాబు వీరిని కంట్రోల్లోకి తేకపోతే పార్టీని ముంచేందుక అయినా వీరు వెనకాడరు.