అక్కడ టీడీపీకి బలమైన నేత దొరికేసినట్టే
టీడీపీ నాయకత్వం, దశ, దిశ లేని నియోజకవర్గాలు ఏపీలో దాదాపుగా 50 ఉన్నాయంటే నమ్మాల్సిందే. పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండి.. గత ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ [more]
టీడీపీ నాయకత్వం, దశ, దిశ లేని నియోజకవర్గాలు ఏపీలో దాదాపుగా 50 ఉన్నాయంటే నమ్మాల్సిందే. పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండి.. గత ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ [more]
టీడీపీ నాయకత్వం, దశ, దిశ లేని నియోజకవర్గాలు ఏపీలో దాదాపుగా 50 ఉన్నాయంటే నమ్మాల్సిందే. పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండి.. గత ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇటీవల టీడీపీ రాష్ట్ర కమిటీల ప్రకటనకు ముందు, ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో కొందరికి బాధ్యతలు ఇచ్చినా వారిలో ఎంతమంది నియోజకవర్గ స్థాయి నాయకులు అన్న ప్రశ్నలకు ఆన్సర్లు లేవు. ఇలాంటి లిస్టులో సీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లిస్టులోదే ఆత్మకూరు నియోజకవర్గం. ఇక్కడ ఎన్టీఆర్ ప్రభంజనంలో 1994లో మాత్రమే చివరి సారిగా టీడీపీ గెలిచింది. నాటి నుంచి నేటి వరకు 26 ఏళ్లలో ఎప్పుడూ టీడీపీ గెలిచింది లేదు.
విభజన తర్వాత కూడా…..
రాష్ట్ర విభజన జరిగాక కూడా ఆత్మకూరులో పోటీ ఇచ్చే నాయకుడు టీడీపీ లేకుండా పోయాడు. 2014 ఎన్నికల్లో ఓ మండల స్థాయి నేత అయిన గూటూరి మురళీ కన్నబాబుకు సీటు ఇవ్వగా 31 వేలతో ప్రస్తుత మంత్రి గౌతంరెడ్డి చేతిలో ఓడారు. అక్కడ మెజార్టీతోనే టీడీపీ నెల్లూరు ఎంపీ సీటును సైతం స్వల్ప తేడాతో కోల్పోయింది. ఇక గత ఎన్నికల్లో రాజకీయాలకు అవుట్ డేటెడ్ అయిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యను పోటీ చేయించగా.. ఆయన ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. గత యేడాదిన్నర కాలంగా ఆత్మకూరులో పార్టీ నడిపించే నాథుడు లేక టీడీపీ జెండాలు కూడా కనిపించే పరిస్థితి లేదు.
బొమ్మి పేరును…..
గత ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అక్కడ టీడీపీ పగ్గాలు అప్పగించేందుకు సరైన నేతే బాబుకు దొరకని పరిస్థితి. చివరకు 2014లో ఓడిన మురళీ కన్నబాబే కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆత్మకూరు పగ్గాలు జడ్పీ మాజీ చైర్మన్ బొమ్మి రాఘవేంద్రరెడ్డికి ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. రాఘవేందర్ రెడ్డి గత ఎన్నికలకు ముందే సీటు ఆశించారు. తాను పోటీ చేస్తాను.. మీరు తప్పుకోవాలని కృష్ణయ్యను అభ్యర్థించినా చివరకు బాబు మొగ్గు కృష్ణయ్య వైపే ఉండడంతో ఆయన ఆశలు నెరవేరలేదు.
వైసీపి నుంచి వచ్చి…..
వైసీపీ నుంచి జడ్పీ చైర్మన్ అయిన రాఘవేంద్ర రెడ్డికి జగన్ వెంకటగిరి పగ్గాలు ఇచ్చారు. చివర్లో ఆనం ఎంట్రీతో బొమ్మిని పక్కన పెట్టడంతో ఆయన టీడీపీలోకి జంప్ చేసి ఆత్మకూరు సీటు ఆశించినా దక్కలేదు. ప్రస్తుతం ఆత్మకూరు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బొమ్మితో పాటు కన్నబాబు పోటీలో ఉన్నా సామాజిక సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు బొమ్మి వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని విధాలా కన్నబాబు కంటే బొమ్మి రాఘవేందర్ రెడ్డే అక్కడ పార్టీకి బలమైన నేతే అవుతారని భావిస్తున్నారు. మొత్తానికి బొమ్మి అయినా ఆత్మకూరులో మూడు దశాబ్దాలకు టీడీపీ జెండా ఎగరేసే అదృష్టం దక్కించుకుంటాడో ? లేదో ? ఆయన సత్తా మీదే ఆధారపడి ఉంది.