టీడీపీలో అర్జున సారథ్యం విఫలమవుతోందా…?
అసలే సమస్యలతో సతమతం అవుతున్న టీడీపీలో నాయకులు కూడా ఇప్పుడు సమస్యగా మారారు. ఒకవైపు అధికార పార్టీ దూకుడుతో పార్టీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో [more]
అసలే సమస్యలతో సతమతం అవుతున్న టీడీపీలో నాయకులు కూడా ఇప్పుడు సమస్యగా మారారు. ఒకవైపు అధికార పార్టీ దూకుడుతో పార్టీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో [more]
అసలే సమస్యలతో సతమతం అవుతున్న టీడీపీలో నాయకులు కూడా ఇప్పుడు సమస్యగా మారారు. ఒకవైపు అధికార పార్టీ దూకుడుతో పార్టీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో పార్టీకి నేతలు లేకుండా పోయారు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఒకటి కృష్ణా జిల్లాలోని గన్నవరం. ఇక్కడ నుంచి వరుసగా రెండుసార్లు వల్లభనేని వంశీ విజయం సాధించారు. సినీ నిర్మాతగా.. పారిశ్రామిక వేత్తగా ఆయనకు మంచి పేరుంది. అదే సమయంలో నియోజకవర్గం అభివృద్దితో పాటు అక్కడ పార్టీని అభివృద్ధి చేశారు. అందుకే భారీ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎదుర్కొని సైతం వంశీ గత ఎన్నికల్లో రెండోసారి గెలిచారు.
పార్టీ బలంగా …..
అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో వల్లభనేని వంశీ అధికార పార్టీ వైపు చూశారు. దీంతో ఇక్కడ టీడీపీ ఇంచార్జ్ పీఠం ఖాళీ అయింది. గతంలో దాసరి బాలవర్ధనరావు.. ఇప్పుడు వంశీ వంటి వారు ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంతో కేడర్ విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే.. వీరిని నడిపించడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. వల్లభనేని వంశీ తర్వాత.. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బచ్చుల అర్జునుడుకు చంద్రబాబు పదవిని అప్పగించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అర్జునుడు అయితే.. వంశీకి చెక్ పెడతారని, పార్టీ కేడర్‌ను కాపాడుకుంటారని బాబు ఆశించారు. గన్నవరంలో యాదవ వర్గం ఓటింగ్ ఎక్కువ. గతంలో ఇక్కడ నుంచి ముద్దరబోయిన ( యాదవ వర్గం) ఎమ్మెల్యేగా గెలిచారు.
ఏడాదిన్నర అవుతున్నా….
అయితే బచ్చుల టీడీపీ ఇంచార్జ్‌గా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అయినా ఇక్కడ దృష్టి పెట్టలేదని అంటున్నారు తమ్ముళ్లు. తొలిదశలో ఆయన కరోనాకు గురికావడంతో ఇంటికే పరిమితమయ్యారు. తర్వాత స్థానిక ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నానని చెప్పి.. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. నిన్న మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ ఉండడంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే.. ఎలాంటి కేసు పెడతారో అని.. ఆయన వెనుకంజ వేశారు. పేరుకు మాత్రమే ఆయన ఇన్చార్జ్గా ఉన్నా పార్టీకి ఉపయోగం లేదని స్థానిక కేడర్ చెవులు కొరుక్కుంటోంది.
సరైన నేతకు ఇవ్వాలని….?
కరోనా కారణంగా నియోజకవర్గంలో ఎంతో మంది టీడీపీ కేడర్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యకర్తలకు ఏదైనా సాయం చేయించే అంశంలోనూ బచ్చుల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా వల్లభనేని వంశీ దూకుడును సైతం ఆయన అడ్డుకోలేక పోతున్నారని..ఆర్థికంగా బలహీనంగా ఉన్న అర్జునుడు వల్ల.. గన్నవరంలో టీడీపీ కకావికలం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు ఇప్పటికైనా.. సరైన నేతకు ఇక్కడ అవకాశం ఇవ్వాలనేది సీనియర్ల మాట.