గ్రేటర్ బరిలో టీడీపీ… ఎవరికి దెబ్బ పడుతుందో…?
గ్రేటర్ హైదరాబాద్ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. నాటి సమైక్య రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గ్రేటర్లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండేది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన [more]
గ్రేటర్ హైదరాబాద్ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. నాటి సమైక్య రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గ్రేటర్లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండేది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన [more]
గ్రేటర్ హైదరాబాద్ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. నాటి సమైక్య రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గ్రేటర్లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండేది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోయినా గ్రామీణ గ్రేటర్‌తో పాటు నగరంలో కొన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటింది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన టీడీపీ నగరంలో ఒకటి రెండు సీట్లు మినహా మిగిలిన చోట్ల స్వీప్ చేసేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశానికి నూకలు చెల్లిపోయయని భావించిన టీడీపీ నాయకులు టీఆర్ఎస్లోకి జంప్ చేసేయడంతో ఆ పార్టీ కేడర్ చెల్లా చెదురు అయిపోయింది. చివరకు గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఆ పార్టీకి ఒక్క కూకట్పల్లి డివిజన్ మాత్రమే వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కంచుకోటలుగా ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, జూబ్లిహిల్స్ లాంటి చోట్ల కాంగ్రెస్‌తో జట్టుకట్టి పోటీ చేసినా టీడీపీ సోదిలో లేకుండా పోయింది.
సెటిలర్లు ఎక్కువగా….
గ్రేటర్లో టీడీపీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరిదారి వారు చూసుకున్నా ఓటింగ్ మాత్రం ఉంది. సెటిలర్లు, సీమాంధ్రులు, టీడీపీని బలంగా అభిమానించే సామాజిక వర్గాలు ఉన్న చోట్ల ఇప్పటకి మంచి ఓటింగే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడాక జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. ఇక ఇప్పుడు జరుగుతోన్న గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో గ్రేటర్లో టీడీపీ ప్రభావం చూపకపోయినా… ఆ పార్టీకి వచ్చే ఓట్లు మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాతలను ఖచ్చితంగా మారుస్తాయన్న అంచనాలు ఉన్నాయి.
గ్రేటర్లో పరువు కోసం….
ప్రస్తుతం ఏపీలో ఎలాంటి ఎన్నికలు లేవు. పార్టీ కమిటీల ఎంపికలు కూడా పూర్తయ్యాయి. దీంతో చంద్రబాబు చాలా రిలీఫ్‌గా ఉన్నారు. పైగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మరో ఇరవై రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. ఈ క్రమంలోనే తమకు పట్టున్న గ్రేటర్ పరిధిలో తమ సత్తా చాటాలని బాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ గత నాలుగైదేళ్లలో గెలవకపోయినా మంచి ఓటు బ్యాంకు ఉందని లెక్కలు వేసుకుంటోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ కూకట్‌పల్లితో మాత్రమే గెలిచినా చాలా డిజజన్లలో టీడీపీ రెండో స్థానంలో ఉంది. ఆ ఎన్నికల్లో పార్టీకి మొత్తం 16 శాతం ఓట్లు వచ్చాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌తో జట్టుకట్టి 13 సీట్లలో పోటీ చేసిన టీడీపీ గ్రేటర్ పరిధిలో 6 చోట్ల పోటీ చేసి ఓడినా గణనీయమమైన ఓట్లతో అన్ని చోట్లా రెండో స్థానంలో ఉంది.
టీఆర్ఎస్ కు ప్లస్సా…?
ఇక ఇప్పుడు కూడా గ్రేటర్ లో అన్ని చోట్లా పోటీ చేసినా పట్టున్న డివిజన్లలో బలంగా ఓట్లు చీల్చడం ద్వారా తమ సత్తా చాటాలని టీడీపీ పావులు కదుపుతోంది. గ్రేటర్ పరిధిలో కనీసం పరువు నిలుపుకునేలా అయినా డివిజన్లు గెలుపొందాలని చూస్తోంది. అది సాధ్యంకాకపోయినా టీడీపీ చీల్చే ఓట్లు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లలో ఏ పార్టీకి దెబ్బేస్తాయన్నదానిపై పెద్ద చర్చలే నడుస్తున్నాయి.గ్రేటర్ లో టీడీపీ పోటీ చేస్తే అది ఖచ్చితంగా టీఆర్ఎస్కు ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ ఇక్కడ 2014లో టీడీపీతో జట్టుకట్టే 5 సీట్లలో గెలిచింది. అదే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒక్క సీటుతో మాత్రమే సరిపెట్టుకుంది.
బీజేపీకి నష్టమేనా?
తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీకి వచ్చిన ఏకైక సీటు గ్రేటర్ లో ఉన్న గోషామహాల్ మాత్రమే. ఇప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న సీమాంధ్రేతర ఓటర్లు, కొన్ని సామాజిక వర్గాల ఓటర్లు టీడీపీ వైపు మొగ్గినా.. ఆ ప్రభావం టీఆర్ఎస్పై ఉండదని.. బీజేపీకే పెద్ద దెబ్బవుతుందని అంటున్నారు. గ్రేటర్ లో టీడీపీ అభిమానులు చాలా మందే ఉన్నారు. వీరంతా టీడీపీ పోటీ చేయకపోతే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఖచ్చితంగా బీజేపీకే ఓట్లేస్తారు. అదే టీడీపీ బరిలో ఉంటే వారి తొలి ప్రాధాన్యత ఆ పార్టీకే ఉంటుంది. అలా బీజేపీ నష్టపోయే ఛాన్సులు ఉన్నా యంటున్నారు. గ్రేటర్ లో టీఆర్ఎస్పై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. టీడీపీ పోటీతో అది చీలినా కూడా టీఆర్ఎస్కే అంతమంగా లాభం ఉంటుంది.