ఒక హాట్ సీట్.. ఇద్దరు టీడీపీ నేతల కన్ను ?
ఒకే ఒక్క సీటు… ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది. అసలే హాట్ హాట్ రాజకీయాలకు వేదిక అయిన ఆ [more]
ఒకే ఒక్క సీటు… ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది. అసలే హాట్ హాట్ రాజకీయాలకు వేదిక అయిన ఆ [more]
ఒకే ఒక్క సీటు… ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది. అసలే హాట్ హాట్ రాజకీయాలకు వేదిక అయిన ఆ జిల్లాలో ఇప్పుడు ఆ సీటు పెద్ద హాట్‌గా మారిపోయింది. అదే గుంటూరు జిల్లాలోని గుంటూరు పశ్చిమ సీటు. ఈ సీటు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏ పార్టీ నేతలకు అయినా హాట్‌గానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్‌రావు ఆ తర్వాత వైసీపీ చెంత చేరిపోయారు. ఇక్కడ పార్టీ దిక్కూలేకుండా ఉండడంతో చంద్రబాబు ఎన్నారై కోవెలమూడి రవీంద్రబాబు ( నాని)కి ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. గత మేయర్ ఎన్నికల్లో ఆయన్నే పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నాని కార్పొరేటర్‌గా గెలిచినా గుంటూరు మేయర్ పదవి వైసీపీ ఖాతాలో పడింది.
అక్కడ బాగా లేకపోవడంతో…..?
ప్రస్తుతం పశ్చిమ ఇన్చార్జ్గా నానియే కొనసాగుతున్నా.. ఆయన నియోజకవర్గ స్థాయిలో వైసీపీని ఢీకొట్టే సత్తా ఉన్న నేత కాదని సొంత పార్టీ నేతలే సందేహిస్తున్నారు. రవీంద్రను వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారా ? లేదా ? అన్న సందేహాలు ఉండగానే ఇద్దరు టీడీపీ నేతలు పశ్చిమంపై కన్నేసిన పరిస్థితి అక్కడ ఉంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పశ్చిమం నుంచి పోటీ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పెదకూరపాడులో వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. పైగా అక్కడ కొమ్మాలపాటికి టీడీపీ కేడర్లోనే వ్యతిరేకత ఉంది. అందుకే ఆయన గత కొద్ది రోజులుగా పశ్చిమంపై కాన్సంట్రేషన్ చేస్తూ వస్తున్నారు. ఆయన నివాసం కూడా పశ్చిమంలోనే ఉంది.
పార్టీ క్యాడర్ తో….?
కొమ్మాలపాటి కూడా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కేడర్‌తో చాపకింద నీరులా మంతనాలు జరుపుతూ దూసుకుపోతున్నారు. ఇక ఇటీవల ప్రస్తుత ఇన్చార్జ్ రవీంద్రపై వ్యతిరేక ప్రచారం వెనక కొమ్మాలపాటి ఉన్నారని కొందరు అనుమానిస్తున్నారు. ఇక వేమూరు, తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలపాటి రాజాకు కూడా ఎప్పటి నుంచో గుంటూరు వెస్ట్‌పై మనసు ఉంది. గతంలో వేమూరు ఎస్సీలకు రిజర్వ్ అయినప్పుడు కూడా రాజా గుంటూరు వెస్ట్ రావాలనుకున్నారు. అయితే బాబు చివర్లో ఆయనకు తెనాలి సీటు ఇచ్చారు.
ఆ నియోజకవర్గంలోనే ఉంటూ…
ఇక ఇప్పుడు తెనాలి కంటే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు ఆలపాటి రాజా ప్రయత్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పశ్చిమ నియోజకవర్గంలోనే రాజా ఉంటున్నారు. ఈ నియోజకవర్గ టీడీపీ కేడర్‌తో ఆయనకు అనుబంధం ఎక్కువ. ఇక్కడ కూడా రాజాకు బలమైన టీం ఉంది. పైగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సపోర్ట్ కూడా రాజాకే ఉంది. అటు కొమ్మాలపాటికి మరో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సపోర్ట్ ఉంది. మరి ఈ ఇద్దరు కీలక నేతల కన్ను పడడంతో గుంటూరు వెస్ట్ సీటు ఇప్పుడు టీడీపీలో హాట్ కేకుగా మారింది.