టీడీపీలో మళ్లీ రగడ.. దారికి రాని తమ్ముళ్లు
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు దొరికిందని సంతోష పడ్డట్టుగా ఉంది.. టీడీపీలో కొందరు నేతల పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి దారుణంగా [more]
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు దొరికిందని సంతోష పడ్డట్టుగా ఉంది.. టీడీపీలో కొందరు నేతల పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి దారుణంగా [more]
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు దొరికిందని సంతోష పడ్డట్టుగా ఉంది.. టీడీపీలో కొందరు నేతల పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. వైసీపీ దూకుడుతో పార్టీ కూసాలు కదిలిపోయాయి. ప్రధాన జిల్లాలు.. కంచుకోటలు.. పెట్టని కోటలు వంటి జిల్లాలు కూడా టీడీపీ ఖాతాల నుంచి చెదిరిపోయాయి. చేజారిపోయాయి. మరీ ముఖ్యంగా ఓటు షేరింగ్ కూడా కేవలం రెండేళ్లలోనే 8 శాతం పడిపోయింది. ఈ సమయంలో అందరూ కలిసి కట్టుగా.. పార్టీని డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందనేది ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు.
ఓటమిపై సమీక్షించుకోకుండా…..
ఎక్కడ తప్పులు జరిగాయి.. ఎలా ముందుకు వెళ్లాలి.. వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని.. నాయకులు ముందుకు సాగితే.. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయినా.. పార్టీని ముందుండి నడిపించుకునేందుకు .. పార్టీ పరువు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. దీనికి భిన్నంగా నాయకులు.. వ్యవహరిస్తున్నారు. గత విషయాలను ఇంకా కడుపులో పెట్టుకుని పార్టీని, నాయకులను సాధించే పనులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం .. కొవ్వూరులో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇక్కడ గత ఎన్నికల్లో అప్పటి మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా నాయకులు రోడ్డెక్కారు. దీంతో జవహర్‌ను ఇక్కడ నుంచి తప్పించారు.
ఆయనే ఉన్నా…..
అయితే.. ఇటీవల టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అధ్యక్ష పదవిని జవహర్‌కు అప్పగించారు. కొవ్వూరు పార్టీ పగ్గాలు ఆయన కావాలని కోరుతున్నా బాబు కొవ్వూరు పార్టీ పగ్గాలు ఇవ్వకుండా… కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న రాజమహేంద్రవరం టీడీపీ పగ్గాలు ఇచ్చి ట్విస్ట్ ఇచ్చారు. రేపో మాపో ఎప్పటకి అయినా జవహర్‌కు కొవ్వూరు పగ్గాలు ఇచ్చేస్తారన్న ప్రచారం కూడా పార్టీలో జోరందుకుంది. దీనిని మళ్లీ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇక తాజా మునిసిపల్ ఎన్నికల్లో కొవ్వూరులో టీడీపీ ఓడింది. పంచాయతీ ఎన్నికల్లోనూ ఆయన వర్గం హవా పని చేయలేదు. జవహర్ తిరువూరుకు ఇన్చార్జ్గా ఉన్నా ఆయన కొవ్వూరులోనే మకాం ఉంటూ కొవ్వూరు టీడీపీ రాజకీయాలనే నడుపుతున్నారు.
మళ్లీ టార్గెట్ జవవహర్…..?
ఈ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఫలితం రావడంతో.. అందరూ కలిసి మళ్లీ జవహర్‌ను టార్గెట్ చేయడం గమనార్హం. తాజాగా భేటీ అయిన.. కొవ్వూరు టీడీపీ నాయకులు.. జవహర్‌పై విరుచుకుపడ్డారు. ఆయన నాయకత్వంలోనే టీడీపీ ఇప్పుడు ఓడిందని తీర్మానం చేశారు. ఆయనను తక్షణమే ఇక్కడ నుంచి పంపేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే.. దీనికి జవహర్ ఒక్కరే బాధ్యులా..? ఆయన తప్పులు చేస్తున్నారని తెలిసి.. ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలోను మిగిలిన వారు.. ఇప్పుడు ప్రశ్నించేవారు ఏం చేశారు? అనే ప్రశ్నకు మాత్రం వారు సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఇలా.. టీడీపీలోనే అంతర్గత కుమ్ములాటలతో నాయకులు.. కొట్టుకుంటే.. ఇక, పార్టీ పట్టాలపైకి ఎక్కేదెప్పుడు? అనేది కీలక ప్రశ్న.