మళ్లీ ముంచుకొచ్చాయే? గట్టెక్కేది ఎలా?
ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. జేబులు ఖాళీ అయ్యాయి. రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేదెలా? అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో [more]
ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. జేబులు ఖాళీ అయ్యాయి. రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేదెలా? అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో [more]
ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. జేబులు ఖాళీ అయ్యాయి. రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేదెలా? అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో బయలుదేరింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని, హైకోర్టు సూచనమేరకే జరుపుతామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ నేతల్లో అలజడి ప్రారంభమయింది. ఇప్పటికిప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవన్న ధీమాతో ఉన్న టీడీపీ నేతలు ఈ ఖర్చును ఎవరు భరిస్తారన్న ప్రశ్నను అధిష్టానానికి సూటిగా వేస్తున్నారు.
ఇటీవలే కోట్లు ఖర్చు పెట్టి…
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో చాలా మంది ఇప్పటికే తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలను కొందరు పక్కన పడేశారు. శాసనసభ ఎన్నికల సమాయానికి చూసుకోవచ్చులే అన్న ధీమాతో ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. మరోవైపు ద్వితీయశ్రేణి నేతలు కూడా సంతృప్తికరంగా లేరు. వారు కూడా పార్టీ యాక్టివిటీస్ కు దూరంగా ఉంటున్నారు.
బిల్లులు పెండింగ్ లో….
గత చంద్రబాబు హయాంలో ద్వితీయ శ్రేణి నేతలే ఉపాధి హామీ పనుల కాంట్రాక్టులను దక్కించుకున్నారు. అయితే కొత్త ప్రభుత్వం వారి బిల్లులను నిలిపివేసింది. ఒక్కొక్కరికి లక్షల్లో బకాయీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి సాయం కూడా అందనట్లే. ఇక పూర్తి బాధ్యత నియోజకవర్గ ఇన్ ఛార్జిపైనే పడుతుంది. ఇప్పటికే చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు. పార్టీ కూడా ఎటువంటి ఆర్థిక సాయం అందించ లేదని కూడా అంతర్గత సమావేశాల్లో చెప్పినట్లు తెలిసింది.
తమ వల్ల కాదంటున్న…..
చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను నియమించారు. ఒక్కో అసెంబ్లీకి ముగ్గురు పరిశీలకులను పంపుతామని చెప్పారు. వీరే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అయితే ఖర్చు ఎవరు భరిస్తారన్నదే ప్రశ్న. దూకుడు మీద ఉన్న అధికార వైసీపీని ఎదుర్కొనడం అంత సులువు కాదని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రజలు కూడా తమ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పార్టీ వైపు చూస్తారని, ఖర్చు చేయడం వృధా అని మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థలను ఎదుర్కొనడం తెలుగుదేశం పార్టీకి కత్తిమీద సవాల్ గానే మారనుంది.