తమ్ముళ్ళు తలుపేసుకున్నారు… తీసేదెప్పుడు?
ప్రజలతో నాయకులకు పని ఎన్నికల సమయంలోనే ఉంటుంది. ఆ తరువాత అయిదేళ్ళ పాటు ప్రజలే ఆ నాయకుల వద్దకు వెళ్ళి పడిగాపులు కాయాలి. ఇది నిత్య సత్యం. [more]
ప్రజలతో నాయకులకు పని ఎన్నికల సమయంలోనే ఉంటుంది. ఆ తరువాత అయిదేళ్ళ పాటు ప్రజలే ఆ నాయకుల వద్దకు వెళ్ళి పడిగాపులు కాయాలి. ఇది నిత్య సత్యం. [more]
ప్రజలతో నాయకులకు పని ఎన్నికల సమయంలోనే ఉంటుంది. ఆ తరువాత అయిదేళ్ళ పాటు ప్రజలే ఆ నాయకుల వద్దకు వెళ్ళి పడిగాపులు కాయాలి. ఇది నిత్య సత్యం. ఇపుడు దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి వీర విహారం చేస్తోంది. ప్రతి పల్లె తల్లడిల్లుతోంది. ప్రతి గుండె అల్లాడుతోంది. ఈ కీలకమైన సమయంలో సేవకు ముందుకు వచ్చిన వారే నాయకులు. అధికార పక్షంగా వైసీపీకి ఎటూ తప్పని బాధ, బాధ్యత ఇది. కానీ ప్రతిపక్షంగా ఉంటూ నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీ విషయంలోనే ఇపుడు విమర్శలు వస్తున్నాయి.
పెద్ద తలకాయలేవీ…?
శ్రీకాకుళం జిల్లాలో తలపండిన తమ్ముళ్ళు ఉన్నారు. వారంతా ఒకరికి ఒకరు తీసిపోరు, నిన్నటి దాకా అధికార వైభోగంతో తమ కత్తికి ఎదురులేదనిపించుకున్నారు. అటువంటి వారు ప్రతిపక్షంలోకి రాగానే ఒక్కసారిగా నీరసించిపోయారు. అది సరే అనుకున్నా కరోనా వంటి విపత్తు వేళ అయిపూ అజా లేకుండా పొయారని జనాలు గోల పెడుతున్నారు. దశాబ్దాల రాజకీయ జీవితాన్ని జనంతో కలసి పండించుకున్న మాజీ మంత్రులు, సీనియర్ నేతలూ ఇలా ఉలుకూ పలుకూ లేకుండా పోవడాన్ని చూసి సొంత పార్టీలోని వారే అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఎవరికి వారుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. పార్టీ కార్యకర్తలు, జనాలు ఏమైపోతేనేం అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని పసుపు శిబిరంలోనే నిరసన వ్యక్తం అవుతోంది.
ప్రవాస జిల్లాల్లో …..
ఎపుడూ తన నోటికి అదుపు లేదని చాటి చెప్పే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తన మకాంని విశాఖకు మార్చేశారు. ఆయన లాక్ డౌన్ పీరియడ్ అంతా అక్కడే ఉంటున్నారు. తన ట్వీట్ల ద్వారా అపుడపుడు ప్రభుత్వంపైన విమర్శలు చేయడం తప్ప అచ్చెన్న చేసేదేమీ లేదని అంటున్నారు. మరో నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయిన కళా వెంకటరావు కేరాఫ్ అమరావతి అంటున్నారు. లాక్ డౌన్ నుంచి ఆయన అక్కడే పరిమితం అయ్యారని, వెనక్కి రాలేదు నరికదా కనీసం ప్రజలకు సాయం చేసే విషయంలో తమ క్యాడర్ కి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి.
వీరంతా ఇంతేనా…?
ఇక మాజీ మంత్రులు కోండ్రు మురళీమొహనరావు, గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, జిల్లాకు చెందిన రెండవ టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వంటి వారు అయిపూ అజా లేరని అంటున్నారు. వీరంతా కూడా కరోనా భయంతో బయటకు రావడం లేదా, లేక ఓడించిన జనాలతో మాకేం పని అని వెనక్కు పోతున్నారా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చిత్రమేంటంటే పెద్ద తలకాయలు బరిలోకి దిగకపోయినా కార్యకర్తలు, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధులు మాత్రం అక్కడక్కడ కనిపిస్తూ జనాలకు సాయం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఎంతటి టీడీపీ పార్టీ ఎలా అయిపోయిందన్న బాధతో పాటు, ఆగ్రహం కూడా సొంత పార్టీలోనే కలుగుతోందిట.