టీడీపీ ఖాతాలో ఆ మూడు కార్పొరేషన్లా ? ఛాన్సులున్నాయే ?
ఏపీలో వరుస ఎన్నికలతో రాజకీయం రంజుగా మారుతోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. వరుసగా ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఆ వెంటనే తిరుపతి [more]
ఏపీలో వరుస ఎన్నికలతో రాజకీయం రంజుగా మారుతోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. వరుసగా ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఆ వెంటనే తిరుపతి [more]
ఏపీలో వరుస ఎన్నికలతో రాజకీయం రంజుగా మారుతోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. వరుసగా ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఆ వెంటనే తిరుపతి ఉప ఎన్నిక ఇలా వరుస పెట్టి ఈ సమ్మర్ అంతా ఎన్నికల కోలాహాలమే నడవనుంది. కీలకమైన నగర సంస్థల ఎన్నికల్లో ఏపీలో కార్పొరేషన్లలో ఎక్కడ ఎవరు పాగా వేస్తారు ? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ జోరు చూపిస్తోన్న నేపథ్యంలో పలు ప్రీ పోల్ సర్వేలు అమరావతి ప్రాంతంలో ఉన్న విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఫైట్ ఉంటందనే ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే వస్తోన్న ప్రీ పోల్స్ సర్వేల్లో ఓ సర్వే మాత్రం ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. సదరు సర్వే సైతం మూడు కార్పొరేషన్లలోనే వైసీపీ, టీడీపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని… టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉంటుందని చెప్పినా అందులో గుంటూరు మాయమైంది. గుంటూరుకు బదులుగా విజయనగరం కార్పొరేషన్ వచ్చి చేరింది.
విజయనగరం కార్పొరేషన్ లో….
చాలా మంది రాజకీయ విశ్లేషకులు సైతం గుంటూరు, విజయవాడలో హోరా హోరీ పోరులో టీడీపీకే ఎడ్జ్ ఉండొచ్చేమో అంటున్నారు. కాని ఈ ప్రీ పోల్ సర్వేలో గుంటూరు బదులుగా విజయనగరం వచ్చి చేరింది. ఈ మూడు కార్పొరేషన్లలో విశాఖలో నగరంలోని నాలుగు సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ జెండాలే ఎగిరాయి. ప్రభుత్వం మారాక వైసీపీ చాలా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది. గంటా టీడీపీలో యాక్టివ్ గా లేకపోవడంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన కార్పొరేషన్ ఎన్నికలు పట్టించుకునే పరిస్థితి లేదు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీకి దూరమయ్యారు. అయినా విశాఖ రాజధాని వ్యవహారంలో తాత్సారం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాలు అధికార పార్టీని దెబ్బకొడతాయన్న అంచనాలు ఉన్నాయి. కొంతమంది నాయకులను వైసీపీ, టీడీపీ నుంచి లాక్కున్నా క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండడంతో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.
విజయవాడలో గెలిచే అవకాశాలు….
ఇక విజయవాడలో గత ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు తూర్పు ఎమ్మెల్యే సీటు టీడీపీ గెలుచుకుంది. ఆ మాటకు వస్తే టీడీపీ చాలా చాలా బలంగా ఉన్న కార్పొరేషన్లలో విజయవాడే ఫస్ట్ ప్లేసులో ఉంది. ఇక్కడ టీడీపీ నేతల మధ్య మేయర్ విషయంలో బేధాభిప్రాయాలు లేకపోయి ఉంటే ఈ పాటికే వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలై ఉండేది. రాజధాని వికేంద్రీకరణ తర్వాత నగర ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. మధ్య తరగతి జీవనం అతలాకుతలం అయ్యింది. ఇవన్నీ పని చేస్తే ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలున్నాయి. వీటిని ఎదుర్కొని వైసీపీ ఎంత వరకు గెలిచి నిలబడుతుందో ? చెప్పలేని పరిస్థితి.
అశోక్ కుటుంబంపై సానుభూతి….
ఇక ఉత్తరాంధ్రలో విజయనగరంలో గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీటు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే ఎంపీగా అశోక్ ఓడినా ఆయనకు నగర పరిధిలో ఏకంగా 26 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అసెంబ్లీకి లెక్కలు తప్పి ఆయన కుమార్తె అతిధి ఓడిపోయారు. ఈ సారి అనేక సమీకరణలు ఇక్కడ టీడీపీకి ప్లస్ అవుతున్నాయి. అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని ప్రభుత్వం టార్గెట్ చేయడంతో వారి పట్ల పార్టీలతకు అతీతంగా ప్రజల్లో సానుభూతి పెరిగింది. అతిథి గత ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటున్నారు. అన్నింటికి మించి ఎమ్మెల్యే కోలగట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి రాకూడదని వైసీపీలోనే చక్రం తిప్పుతోన్న ఓ కీలక నేత వర్గం కార్పొరేషన్ ఎన్నికల్లో కోలగట్లకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్న ప్రచారం ఇప్పటి నుంచే వినిపిస్తోంది. సదరు నేత వర్గానికి కోలగట్ల ఒక్క కార్పొరేటర్ టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఈ సానుకూలతలను టీడీపీ ఎలా వాడుకుంటుందో ? చూడాలి.
గుంటూరులో మాత్రం…?
టీడీపీ గెలిచే లేదా గట్టిపోటీ ఇచ్చే మూడు కార్పొరేషన్ల లిస్టులో గుంటూరు లేదు. ఇక్కడ పార్టీ కేడర్‌లో అనైక్యత.. జిల్లాలో ఉన్న బలమైన నాయకులు.. నగరంలో లేకపోవడంతో పాటు వారు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకపోవడం.. టీడీపీకి ఎంపీ జయదేవ్ ఉన్నా విజిటింగ్ ఎంపీగా మారిపోవడం లాంటి మైనస్‌లు ఇక్కడ టీడీపీకి ఉంటే… వైసీపీలో కీలక నేతలు అందరూ ఈ ఎన్నికలను కసితో తీసుకుని పని చేస్తున్నారు. మరి ఈ అంచనాలు ఎలా పని చేస్తాయో ? చూడాలి.