టీడీపీ గెలిచే మున్సిపాలిటీలు ఇవేనట…?
ఏపీలో పల్లె తీర్పు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పట్టణ తీర్పుపైనే ఉంది. మార్చి 10న ఏపీలో 12 కార్పొరేషన్లతో పాటు 75 నగర పంచాయతీలు / [more]
ఏపీలో పల్లె తీర్పు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పట్టణ తీర్పుపైనే ఉంది. మార్చి 10న ఏపీలో 12 కార్పొరేషన్లతో పాటు 75 నగర పంచాయతీలు / [more]
ఏపీలో పల్లె తీర్పు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పట్టణ తీర్పుపైనే ఉంది. మార్చి 10న ఏపీలో 12 కార్పొరేషన్లతో పాటు 75 నగర పంచాయతీలు / మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. పట్టణాల్లో ప్రభుత్వంతో పాటు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత క్యాష్ చేసుకుని 50 శాతం స్థానాలలో తప్పుకండా గెలుస్తామన్న ధీమా టీడీపీ నేతలకు ఉంది. వీళ్ల ఆశలు ఎలా ? ఉన్నా వాస్తవంగా టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సీన్ ఉందా ? అని వాస్తవ పరిస్థితులు బేరీజు వేసుకుంటే టీడీపీ సింగిల్ డిజిట్ మున్సిపాల్టీలు దక్కించుకుంటేనే గొప్ప అన్నట్టుగా పరిస్థితి ఉంది.
ఉన్నంతలో ఇక్కడేనట…..
ఉన్నంతలో శ్రీకాకుళం జిల్లాతో పాటు రాజధాని జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు జిల్లాలలో మాత్రమే టీడీపీకి కాస్తో కూస్తో ఆశలు ఉన్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా వీక్‌గా ఉన్న చోట పైకి ఆశలు ఉన్నా రేపటి రోజున ఫలితాల్లో దానిని టీడీపీ క్యాష్ చేసుకుంటుందా ? అన్నది కూడా డౌటే. టీడీపీకి ఆశలు ఉన్న స్థానాలు ఆ పార్టీ నేతల లెక్కల ప్రకారం ఏకంగా 35 నుంచి 40 వరకు ఉన్నా అవన్నీ కలలే అనుకోవాలి. శ్రీకాకుళం ఎన్నికలు జరిగే మున్సిపాల్టీల్లో ఇచ్ఛాపురం, పలాసలో కాస్త ఆశలు ఉన్నాయి.
అంచనాలున్న మున్సిపాలిటీలు….
విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలో ఆశలు ఉన్నాయంటున్నారు. ఇక తూర్పు గోదావరిలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గం పెద్దాపురంలో ఛాన్స్ ఉంటే ఉండొచ్చని అంచనా. ఇక పశ్చిమ గోదావరిలో నిడదవోలుపై కలలు కంటోంది. కృష్ణాలో నందిగామ, ఉయ్యూరు, పెడన లాంటి చోట్ల ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి. ఇక అమరావతి జిల్లా గుంటూరులో తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె ఈ మూడు చోట్ల టీడీపీకి హోప్ ఉంది. ప్రకాశంలో అద్దంకి ఒక్కటి మాత్రమే గెలిచే అవకాశం ఉంది.
ఇక్కడ టఫ్ ఫైట్ ఇచ్చినా…?
ఇక కడప, కర్నూలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టీడీపీ మాత్రం ప్రొద్దుటూరు లాంటి చోట్ల పగటి కలలు కంటున్నట్టే ఉంది. చిత్తూరులో నగరి నియోజకవర్గంలో పుత్తూరులో టీడీపీ కొంత టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు. ఇక అనంతపురంలో హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం లాంటి చోట్ల గట్టి పోటీలో అయినా గెలుస్తామన్న ఆశలు టీడీపీకి ఉన్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ డబుల్ డిజిట్ సాధిస్తేనే చాలా గ్రేట్ అనిపించే వాతావరణం ఉంది. ఈనెల 14వ తేదీన టీడీపీ ఎన్ని మున్సిపాలిటీలు గెలుస్తుందన్నది తేలనుంది.