బాబు అక్కడ ఇద్దరు లీడర్లను సెట్ చేస్తావా?
అదేంటో గాని కొన్ని ఎంపీ స్థానాల్లో చంద్రబాబుకు ఎప్పటకీ బలమైన క్యాండెట్లు దొరకరు. ప్రతి ఎన్నికకు ఓ కొత్త అభ్యర్థినో లేదా అప్పటికప్పుడు డబ్బులు ఇస్తామని ముందుకు [more]
అదేంటో గాని కొన్ని ఎంపీ స్థానాల్లో చంద్రబాబుకు ఎప్పటకీ బలమైన క్యాండెట్లు దొరకరు. ప్రతి ఎన్నికకు ఓ కొత్త అభ్యర్థినో లేదా అప్పటికప్పుడు డబ్బులు ఇస్తామని ముందుకు [more]
అదేంటో గాని కొన్ని ఎంపీ స్థానాల్లో చంద్రబాబుకు ఎప్పటకీ బలమైన క్యాండెట్లు దొరకరు. ప్రతి ఎన్నికకు ఓ కొత్త అభ్యర్థినో లేదా అప్పటికప్పుడు డబ్బులు ఇస్తామని ముందుకు వచ్చిన వాళ్లనో ఎంపీలుగా పోటీ చేయిస్తారు. అక్కడ వాళ్లు ఎలాగూ గెలవరు. ఎన్నికలు అయ్యాక వాళ్లు అడ్రస్ ఉండక పోవడమో లేదా ? పార్టీ మారిపోవడమో జరుగుతుంది. మళ్లీ ఎన్నికకు మళ్లీ అభ్యర్థి కోసం వెతుకులాట. ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ 22 ఎంపీ సీట్లలో ఓడింది. ఓడిపోయిన క్యాండెట్లలో సగం మంది పార్టీ నుంచి దూరమైపోయారు. మిగిలిన వాళ్లు యాక్టివ్గా లేరు. ఎక్కడో భూతద్దం పెట్టి చూస్తే బీకే. పార్థసారథి, పవన్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు మినహా ఎంపీగా పోటీ చేసిన వారిలో ఒక్క నేత కూడా బయటకు రాని పరిస్థితి.
1999లోనే గెలిచి….
ఈ క్రమంలోనే టీడీపీ గెలుపు మర్చిపోయి 20 ఏళ్లు అయిన ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు స్థానాల్లో టీడీపీకి సరైన అభ్యర్థి లేక ఆ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల్లో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు స్థానాల్లో చివరి సారిగా 1999లో మాత్రమే టీడీపీ గెలిచింది. అక్కడ నుంచి ప్రతి ఎన్నికకు క్యాండెట్ మారుతూనే వస్తున్నారు అనేకంటే.. చంద్రబాబు మార్చేస్తున్నారు. ఇక్కడ పార్టీని నమ్మి ఎవ్వరూ ఉండడం లేదు. చివరకు పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లోనూ ఈ రెండు చోట్లా టీడీపీ ఓడిపోయింది.
మళ్లీ అదే తప్పు….
గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఉన్న కొండపి అసెంబ్లీలో తప్ప, మిగతా అన్నీ స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. ప్రస్తుతం ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న స్థానాల్లో టీడీపీ ఇన్చార్జ్లు ఎవ్వరూ యాక్టివ్గా లేరు. కొండపి సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ నేతల గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అన్నట్టుగా ఉంది. దర్శికి మాత్రం ఇటీవల కొత్త ఇన్చార్జ్ వచ్చారు. యర్రగొండపాలంలో 2014లో ఓడి ఐదేళ్లు నియోజకర్గ మొఖం చూడని అజితారావునే తీసుకువచ్చి గత ఎన్నికల్లో సీటు ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ ఆమె అడ్రస్ లేరు. పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా నూకసాని బాలాజీకి కేవలం కుల సమీకరణల నేపథ్యంలోనే పదవి కట్టబెట్టినా ఆయన వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. ఇక ఇక్కడ గత ఎన్నికల్లో ఎంపీగా ఓడిన శిద్ధా రాఘవరావు పార్టీ మారిపోయిన సంగతి తెలిసిందే.
ఇరవై ఏళ్లు దాటింది….
ఇక నెల్లూరు పార్లమెంటులో కూడా టీడీపీ గెలుపు మర్చిపోయి 20 ఏళ్లు దాటింది. మరో పదేళ్లకు అయినా ఇక్కడ గెలుస్తుందా ? అంటే డౌటే ? గత ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు స్థానాల్లోనూ టీడీపీ చిత్తుగా ఓడింది. ఒక్క నెల్లూరు సిటీలో మాత్రమే నారాయణ గట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ 2014లో ఓడిన ఆదాల ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో ఓడిన బీద మస్తాన్రావు కూడా ఇప్పుడు వైసీపీలో నే ఉన్నారు. నారాయణ యాక్టివ్గా లేకపోవడంతో సిటీకి కొత్త ఇన్చార్జ్ వచ్చేశారు. కందుకూరులో ఓడిన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అనారోగ్యంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఇక ఇక్కడ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అజీజ్ కు ఓ నియోజకవర్గ స్థాయి నేత కూడా కాదని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. మరి ఇలాంటి దుస్థితి నుంచి చంద్రబాబు పార్టీని ఎప్పటికి ఒడ్డుకు చేర్చుతారో ? చూడాలి.