ఎన్టీఆర్ అడ్డాలో టీడీపీకి ఇన్ని కష్టాలా……?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చాలా జిల్లాల్లో నాయకత్వ కొరతను ఎదుర్కొంటోంది. అదేవిధంగా కీలకమైన కృష్ణా జిల్లాలోనూ ఇదే సమస్య వెంటాడుతోంది. టీడీపీకి ఇక్కడ ముందుండి [more]
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చాలా జిల్లాల్లో నాయకత్వ కొరతను ఎదుర్కొంటోంది. అదేవిధంగా కీలకమైన కృష్ణా జిల్లాలోనూ ఇదే సమస్య వెంటాడుతోంది. టీడీపీకి ఇక్కడ ముందుండి [more]
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చాలా జిల్లాల్లో నాయకత్వ కొరతను ఎదుర్కొంటోంది. అదేవిధంగా కీలకమైన కృష్ణా జిల్లాలోనూ ఇదే సమస్య వెంటాడుతోంది. టీడీపీకి ఇక్కడ ముందుండి పార్టీని నడిపించే నాయకులు లేక పోవడంతో ఇప్పుడు పార్టీ పరిస్థితి అగమ్యంగా తయారైంది. విషయంలోకి వెళ్తే.. ఎస్సీ నియోజకవర్గమైన పామర్రుకు చాలా ప్రత్యేకత ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉంది. విజయవాడలో టీడీపీ రాజధాని మార్పు.. ఇతరత్రా అంశాల నేపథ్యంలో ఎంతో బలంగా ఉన్నప్పటికీ.. పామర్రులో మాత్రం ఎదురీతను ఎదుర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడంతా కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో 2009లో కాంగ్రెస్ నుంచి ఏసుదాసు విజయం సాధించారు. అయితే, తర్వాత చోటు చేసుకున్న రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వైసీపీ గూటికి చేరిపోయారు.
నిజమైన కార్యకర్తలకు…
ఈ క్రమంలో 2014లో జరిగిన ఎన్నికల్లో ఉప్పులేటి కల్పన ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. జగన్‌కు ఎంతో విధేయురాలిగా గుర్తింపు పొందిన కల్పన తర్వాత కాలంలో చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో సహా అదే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్య ప్రయత్నంతో ఆమె టీడీపీ సైకిల్ ఎక్కారు. అప్పటి నుంచి ఇక్కడ ఆమె టీడీపీలోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే, ఆమె పార్టీ మారడాన్ని నియోజకవర్గ టీడీపీ కేడర్ సహించలేక పోయారు. పైగా అమ్ముడు పోయారనే ప్రచారం జోరుగా సాగింది. కల్పన పార్టీ మారాక నిజమైన టీడీపీ కార్యకర్తలను పక్కన పెట్టేసి ఆమె తనతో పాటు పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేశారు. దీంతో నిజమైన టీడీపీ కేడర్ అంతా ఆమెకు ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వవద్దని ఫైట్ చేశారు.
పూర్తిగా వదిలేసి….
చంద్రబాబు తిరిగి ఆమెకే సీటు ఇవ్వడంతో వాళ్లంతా ఆమెను ఓడించేందుకు పనిచేశారు. ఇక నియోజకవర్గ ప్రజలు కూడా ఆమె తీరుపై విసిగిపోయి ఆమెను ఓడించారు. దీంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున కైలే అనిల్ కుమార్ విజయం సాధించారు. సరే.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కానీ, పార్టీ పరంగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ, ఈ విషయంలో కల్పన పూర్తిగా ఫెయిలయ్యారనే వాదన టీడీపీలో బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గంపై ఆమెకు అవగాహన లేదని, ఎవరి సమస్యలూ ఆమె పట్టించుకోలేదని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. తన సొంత లాభం కోసం పార్టీలోకి వచ్చారని టీడీపీలో నేతలు గుర్రుగా ఉన్నారు. వీరిని మచ్చిక చేసుకునేందుకు ఆమె ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అది కూడాలేదు.
వైసీపీలోకి వెళ్లేందుకు…..
పైగా అంతో ఇంతో బలంఉన్న వర్ల రామయ్యతో ఆమె ఇప్పుడు సొంత పార్టీలోనే విభేదిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఆమెకు దూరమయ్యాయి. ఇటీవల స్థానిక ఎన్నికల్లోనూ ఆమెకు తగిన ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ పరిణామాలతో వైసీపీలోకి వెళ్లాలని ఆమె ప్రయత్నించడం మరింతగా పరిణామాలను తీవ్రతరం చేసింది. దీంతో ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడి మాదిరిగా తయారైంది కల్పన పరిస్థితి. దీంతో ఇక్కడ పార్టీని పట్టించుకునేవారు లేకుండా పోయారని పార్టీలో తీవ్రస్థాయి చర్చ సాగుతోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.